సినిమా పేరు ప్రకటించడం ఆలస్యం..సంచలనాల దర్శకుడు రాంగోపాల్‌వర్మ మరోమారు వార్తల్లో నిలిచారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీయనున్నట్లు ఫేస్‌బుక్ వేదికగా ప్రకటించిన రాంగోపాల్ వర్మను ఆ వెంటనే వివాదాలు ముసిరాయి. రాబోయే ఎన్నికల కంటే ముందుగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారని, ప్రతిపక్ష వైసీపీ ఇందుకు నిధులు సమకూర్చుతోందని పలువురు ఆరోపిస్తున్నారంటూ ఓ టీవీ చానల్ ఆయనతో ముఖాముఖిలో ప్రశ్నించింది. ఈ సందర్భంగా టీడీపీ నేతల కోణంలో వర్మను ప్రశ్నలు అడగటంతో వర్మ తనదైన శైలిలో రియాక్టయ్యారు.
గతంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను తీసేందుకు సిద్ధమయ్యానని దానికి ఇప్పుడు పేరు ఖరారు చేశారని వర్మ తెలిపారు. ``ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటించేందుకు ముందుకు రావడం, ఆయన ఆసక్తి చూపడం తన పరిధిలోని కాదు. బాలయ్యకు, నాకు సినిమా చర్చలు జరిగాయి. అయితే భావాలు కుదరకపోవడంతో ఈ సినిమాకు ముందుకు వస్తున్నానని పేర్కొనడం సరికాదు` అని వర్మ స్పష్టం చేశారు. అయితే ఈ సినిమాలో మొత్తం లక్ష్మీపార్వతి మాత్రమే ఉండనున్నారా? ఎన్టీఆర్ కుటుంబాన్ని విశ్వాసం తీసుకోవాల్సిన అవసరం లేదా...అనే ప్రశ్నకు వర్మ ఆసక్తికరంగా స్పందించారు. తాను తీసుకునేది లక్ష్మీపార్వతి విషయం కాబట్టి ఆమెను సంప్రదిస్తానని అన్నారు. అందరికీ తెలిసిన అంశాలను కాకుండా ఎన్టీఆర్‌లోని ఎమోషనల్ భావాలను వ్యక్తీకరిచేందుకు తాను సినిమాను తీస్తున్నానని వివరించారు.
``లక్ష్మీపార్వతికి ఎందుకంత ప్రాధాన్యం ఇచ్చారు? ఎందుకు ఎన్టీఆర్ అలాంటి అభిప్రాయాలతో ఉన్నారు. లక్ష్మీపార్వతిని కలిసినప్పుడు ఆయన మానసిక స్థితి ఏంటి అనేది నా సినిమాలో ప్రత్యేకంగా ఉంటుంది. లక్ష్మీపార్వతిలో ఏదో ప్రత్యేకత చూశారు. ఆమె వచ్చాక ఎన్టీఆర్ జీవితంలో మార్పు వచ్చింది. అదేంటి అనేది ఈ సినిమాలో ఉంటుంది. నేను ఆరాధించే వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్‌ను ఉపయోగించుకోవాలనే ఆలోచన నాకు లేదు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి జర్నీలో ఏం జరిగిందనేది సినిమాలో ఉంటుంది. నిజాన్ని చూపించాలని అనుకుంటున్నాను. అది అందరికీ నచ్చాలని లేదు`` అని వర్మ కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. ``నాకు ఏ పార్టీకి సంబంధం లేదు. నేను ఎప్పుడు ఏ రాజకీయపార్టీకి మద్దతు ఇవ్వలేదు. నేను సినిమా తీయకుండానే....అందులో ఏం చూపిస్తానో తెలియకుండానే.... ఏం తీస్తానో నేను చెప్పకుండానే... వాళ్లు ఇలా కామెంట్ చేయడం గుమ్మడికాయ దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది.`` అని వర్మ టీడీపీ అభిమానులకు ఘాటు కౌంటర్ వేశారు.