జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ రైతులకు అండగా నిలబడేందుకు తన కార్యాచరణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకున్నారు. ప్రజలకు అండగా నిలబడాలే తప్ప పార్టీకి, వ్యక్తులకు కొమ్ముకాయద్దు అని రామ్ జెఠ్మలానీ చేసిన వ్యాఖ్యల్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పవన్ పోస్ట్ చేశారు. ఆ తర్వాత రాజధాని రైతుల పక్షాన పోరాటం షురూ చేశారు. కానీ ఇపుడు అదే జెఠ్మాలనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
భారతదేశం నుంచి కాశ్మీర్‌ను వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న పలు సంస్థల్లో హురియత్ కాన్ఫరెన్స్ ఒకటి. వారిని దేశం అంతా వేర్పాటువాదులుగానే చూస్తారు. కానీ దీన్ని రామ్ జెఠ్మలానీ తప్పుపట్టారు. ప్రభుత్వంతోపాటు రాజకీయ పార్టీలలోని అవివేకవంతులు హురియత్ నేతలను వేర్పాటు వాదులుగా ముద్ర వేశారని ఆరోపించారు. హురియత్ నేతలను వేర్పాటు వాదులుగా పిలవడాన్ని ఆయన తప్పు పట్టారు.
హురియత్ నేతలను అందరూ అపార్థం చేసుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక స్వతంత్ర దేశమైన పాకిస్థాన్ రాయబారిని హురియత్ నేతలు కలవకుండా ఎలా నియంత్రిస్తారని రామ్ జెఠ్మలానీ ప్రశ్నించారు. భారత్ , పాక్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రద్దుపైనా జెఠ్మాలానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తనను ఎంతో నిరాశపర్చారన్నారు.పాలకుల్లో చాలా మందికి అంతర్జాతీయ చట్టాల గురించి కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. గౌరవ ప్రదమైన శాంతియుత మార్గాల ద్వారానే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని రామ్ జెఠ్మలానీ అభిప్రాయపడ్డారు.
గతంలో పాక్ వేర్పాటువాదులైన సయ్యద్ అలీషా గిలానీ తదితరులతో జెఠ్మలానీ సమావేశం అయ్యారు. సీనియర్ న్యాయవాదిగా ఎంత పేరుందో..వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ జెఠ్మలానీకి అంతే పేరుంది.
తన ట్విట్టర్ అకౌంట్లో ఇండియన్. ఐ కేర్ ఫర్ అవర్ మదర్ ల్యాండ్ అని ట్యాగ్ లైన్ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఈ విషయమై ఎలా స్పందిస్తారో.