ఉత్తరాదిన వరుస విజయాలతో మంచి జోరుమీదున్న కమలనాథులు దక్షిణాదిపై కన్నేసి వచ్చే ఎన్నికల్లో సీట్లను పెంచుకునేందుకు వ్యూహాలను రచిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే తెలంగాణలో నాలుగు సార్లు పర్యటించారు. అయితే అమిత్ షా ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పార్టీ శ్రేణులు ప్రజల్లోకి అంతగా చొచ్చుకు పోవడం లేదన్న విషయాన్ని అధిష్టానం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది. దీంతో ఎట్టి పరిస్థితులలో లక్ష్యం గురి తప్పొద్దన్న ఉద్దేశ్యంతో ఉన్న నాయకత్వం అవసరమైతే మరో కేంద్ర మంత్రి పదవిని కూడా తెలంగాణకు ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాలలో గత కొన్నేళ్ళుగా బీజేపీ అంటే వెంకయ్యనాయుడు - వెంకయ్య నాయుడు అంటే బీజేపీ అనేలా ఉండేది. ఎవరికి ఏ పదవి కావాలన్నా, ఎవరిని ఏ పనులకు వినియోగించుకోవాలన్న వెంకయ్య కనుసన్నల్లో జరిగేది. తాజాగా ఆయన ఉప రాష్ట్రపతిగా వెళ్ళడంతో తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి ఏ మాత్రం లోటు రాకుండా ఉండేందుకు వీలుగా అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్న చర్చ కూడా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు రెండు కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న పొల్సాని మురళీధర్ రావు - రామ్ మాధవ్ లను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేసే బాధ్యతలను కట్టబెడ్తారన్న ప్రచారం జోరందుకుంది.
తెలంగాణలో పార్టీని ఉరుకులు - పరుగులు పెట్టించేందుకు చేపట్టాల్సిన చర్యలకు అధిష్టానం శ్రీకారం చుట్టిందన్న చర్చ కూడా సాగుతోంది. మురళీధర్ రావుకు తెలంగాణ - రామ్ మాధవ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోటాలో బాధ్యతలను కట్టబెట్టాలన్నది అధిష్టానం ఆలోచన అని పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర పార్టీపైనా - నాయకులపైనా మురళీధర్ రావుకు పూర్తి అవగాహన కూడా ఆయనకు ఉండటమే ఇందుకు కారణం. అంతేకాకుండా జాతీయ స్థాయిలోనూ అనేక మంది నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. త్వరలో రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరుగనున్న ఎన్నికల్లో ఆయనను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. గత కొంత కాలంగా మురళీధర్ రావు తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల అమిత్ షా పర్యటనలో కూడా ఆయనే ప్రధానంగా కనిపించారు. అంతేకాకుండా అధికార టీఆర్ ఎస్ పై ఆయన ఘాటైన విమర్శలు - ప్రభుత్వ పని తీరును ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించడంలో ఆయన చూపుతున్న శ్రద్ధ పార్టీకి కలిసి వస్తుందని జాతీయ పార్టీ భావిస్తుండవచ్చని నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును వీలైనప్పుడల్లా ఎండగడుతూనే కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆయా పథకాలకు కేటాయిస్తున్న నిధులపై ప్రజల్లో చైతన్యం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని భావిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర పార్టీలోని నాయకుల మధ్య ఉన్న సమన్వయ లోపం, ఉద్యమాలపై చిత్తశుద్ధి లేమిని కూడా మురళీధర్ రావు సరి చేస్తారన్న నమ్మకం కూడా అధిష్టానం పెట్టుకుంది. అదే తరహాలో రాంమాధవ్ కు కూడా రాజ్యసభకు ఎంపిక చేస్తారని అంటున్నారు. జమ్మూకాశ్మీర్ సహా ఈశాన్య రాష్ర్టాల్లో బీజేపీ బలోపేతం, ప్రభుత్వం ఏర్పాటులో రాంమాధవ్ కీలక పాత్ర పోషించినందుకు ఈ చాన్స్ కల్పించనున్నట్లు విశ్లేషిస్తున్నారు.