జమ్ము-కాశ్మీర్ లో బీజేపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి - తెలుగు బిడ్డ రామ్ మాధవ్ సందర్భం వచ్చినపుడల్లా ఎదురుదాడి చేస్తున్నారు. కాశ్మీర్ లో అశాంతిపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై రామ్ మాధవ్ ట్విట్లర్ వేదికగా ఘాటుగా స్పందించారు. కాశ్మీర్ లో అశాంతికి రాజకీయ పరిష్కారం అంటూ ఒమర్ అబ్దుల్లా మాట్లాడటం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. అంతే కాకుండా స్వాతంత్య్ర దినోత్సవం రోజున జమ్మూ కాశ్మీర్ జిల్లాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి గైర్హాజరైన రాజకీయ నేతలపై విమర్శలు గుప్పించారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కాశ్మీర్ లో పరిస్థితిని చక్కదిద్దడానికి చేసిందేమీ లేదని రామ్ మాధవ్ విమర్శించారు. ఇప్పుడు రాజకీయ పరిష్కారం అంటూ మాట్లాడటం రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఒమర్ అబ్దుల్లా బదులిస్తూ పలు ట్వీట్ లు చేశారు. అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా కాశ్మీర్ సమస్యకు పరిష్కారాలు సూచించామని, అయితే అవన్నీ చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లుగా మారాయని పేర్కొన్నారు. మీరు వినడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. మాలో ఎవరైనా హింసను ప్రేరేపించినట్లు రుజువు చేయాలని రామ్ మాధవ్ కు సవాల్ చేశారు.