దుబ్బాకలో గెలుపై రామ్ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్య

Update: 2020-11-10 17:35 GMT
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తీవ్ర ఉత్కంఠత రేపిన ఉపఎన్నికల్లో చివరకు బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు గెలిచిన విషయం తెలిసిందే. ఇదే విషయమై రామ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్ధి గెలుపుతో టీఆర్ఎస్ కుటుంబ పాలనకు జనాలు స్వస్తి పలికినట్లు స్పష్టమైందన్నారు. అయితే మాధవ్ మరచిపోయిందేమంటే టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటి చేసింది కేసీయార్ కుటుంబ సభ్యులు కారు. మరణించిన ఎంఎల్ఏ సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత.

ఎంఎల్ఏ లేకపోతే ఎంపి మరణిస్తే వాళ్ళ కుటుంబసభ్యులకే టికెట్ ఇవ్వటం దాదాపు అన్నీ పార్టీలు చేస్తున్నదే. పార్టీ అభ్యర్ధి గెలుపుకు కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మాధవ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. తమ అభ్యర్ధి గెలుపుపై ఎంఎల్ఏ, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రఘునందనరావు గెలుపు తెలంగాణా రాజకీయాల్లో ఓ కీలక మలుపన్నారు.

టీఆర్ఎస్ పతనానికి ఉపఎన్నికలో ఓటమే నాందిగా లక్ష్మణ్ తో పాటు జాతీయ నేత డీకే అరుణ కూడా అభివర్ణించారు. దుబ్బాకలో గెలవటం ద్వారా రఘునందనరావు చరిత్ర సృష్టించినట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ చెప్పారు.
Tags:    

Similar News