బీజేపీ వ్యూహకర్తల్లో ఒకరు - ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన రాంమాధవ్.. టీఆరెస్ విషయంలో తమ పార్టీ స్టాండేమిటో వెల్లడించారు. టీఆర్ ఎస్ తమకు ఎప్పటికీ మిత్రపక్షం కాలేదని, ఆ పార్టీ తమకు శత్రువేనని రాంమాధవ్ తేల్చి చెప్పారు. కేసీఆర్ ఢిల్లీలో పీఎం మోదీని కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి - శాలువా కప్పి ఫొటోలు దిగుతారని... హైదరాబాద్ రాగానే మజ్లిస్ ముందు మోకరిల్లుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ది డబుల్ గేం అన్నట్లుగా ఆయన మాట్లాడారు.
కేసీఆర్ ప్రతి పనిలోనూ అవినీతిని పెంచి పోషిస్తున్నారని - మిషన్ భగీరథ - మిషన్ కాకతీయ.. ఇలా ఏది తీసుకున్నా కమీషన్లు - పర్సెంటేజీలు కనిపిస్తాయని ఆరోపించారు. మొత్తం పనుల్లో 25 శాతం పర్సెంటేజీలను ముందుగా, బాహాటంగానే నిర్ణయిస్తున్నారని - అందులో మూడుశాతం సిరిసిల్ల మంత్రికి ఇవ్వాల్సిందేనంటూ పరోక్షంగా కేటీఆర్ పై ఆరోపణలు గుప్పించారు.
అసోంలో గతంలో రెండు సీట్లతోనే ప్రారంభించిన తాము ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, తెలంగాణలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని - ఇక్కడ ఏర్పాటు చేయలేమా? అని ధీమా వ్యక్తం చేశారు. కొద్దికాలంగా తెలంగాణలో టీఆరెస్ తో తమ వైఖరేమిటో అర్థం కాక స్తబ్దుగా ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు రాంమాధవ్ క్లారిటీ ఇవ్వడంతో ఉత్సాహం పెంచుకున్నారు.