బీజేపీ నేత మాటః ద్రౌప‌ది వ‌ల్లే కురుక్షేత్ర యుద్ధం

Update: 2017-12-20 16:30 GMT
బీజేపీ సీనియ‌ర్‌ నేత రామ్ మాధవ్  చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. ప్రపంచంలో తొలి స్త్రీవాది ద్రౌపది అని - ఆమె ఒక్కదాని వల్లే కురుక్షేత్ర యుద్ధం జరిగిందని ఆయన అన్నారు. పనజీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఆమె మొండితనం వల్లే కురుక్షేత్ర యుద్ధం జరిగి 18 లక్షల ప్రాణాలు పోయాయని రామ్ మాధవ్ తెలిపారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

`ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నా.. ఆమె ఎప్పుడూ వాళ్ల మాట వినలేదని, స్నేహితుడైన కృష్ణుని మాట వినేది` అని రామ్ మాధ‌వ్ వ్యాఖ్యానించారు. అయితే రామ్ మాధవ్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మిశ్రమంగా స్పందించాయి. కొందరు ఆయన వ్యాఖ్యలు సరైనవే అంటే.. మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. ద్రౌపది ఎన్నో తీవ్ర అమానుష ఘటనలను ఎదుర్కొన్నదని కొందరు వాదిస్తున్నారు. క్లాసికల్ డ్యాన్సర్ సోనల్ మాన్‌ సింగ్ మాత్రం రామ్ మాధవ్ స్పీచ్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేయగా.. ఆయన దానిని రీట్వీట్ చేశారు. అయితే పురాణ కాలం నుంచి అణచివేతకు, అన్యాయానికి గురవుతున్న మహిళలకు ద్రౌపది నిదర్శనంగా నిలిచిందని రచయిత్ర అనితా నాయర్ అభిప్రాయపడ్డారు. ఎప్పుడూ తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ద్రౌపదికి దక్కలేదని ఆమె అన్నారు. మరో రచయిత్రి త్రిషా దాస్ కూడా ద్రౌపది వల్లే కురుక్షేత్ర యుద్ధమన్న వాదనను ఖండించారు.
Tags:    

Similar News