రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి మరో ఆసక్తికరమైన అంకానికి తెర లేవనుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన బీజేపీ సీనియర్ నేత రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ వేసేశారు. బీజేపీ అగ్ర నేతలు - ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు - బీజేపీకి బయటి నుంచి మద్దతుగా నిలిచిన పార్టీల అతిరథ మహారథులు హాజరు కాగా... మొన్న కోవింద్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఘట్టం దేశంలో పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. కోవింద్ నామినేషన్ ఘట్టాన్ని బీజేపీ తన బల ప్రదర్శనకు వేదికగా చేసుకుందన్న వాదన కూడా లేకపోలేదు.
ఈ క్రమంలో నేటి నుంచి కోవింద్ ఢిల్లీ వదిలి దేశవ్యాప్త పర్యటనకు బయలుదేరుతున్నారు. ఎందుకంటే... తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడమే కాకుండా తనకు ఓటు వేయాలంటూ ఆయన అన్ని రాష్ట్రాల ఎంపీలు - ఎమ్మెల్యేలను కోరేందుకేనట. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన అభ్యర్థులు ఇప్పటిదాకా పెద్దగా ప్రచారం చేసిన దాఖలా లేదు. అయితే ఇప్పటికే ఎన్నికల్లో గెలిచేందుకు కోవింద్ కు అవసరమైన మేర మద్దతు కూడగట్టిన బీఏపీ... ఆయననే స్వయంగా ప్రచారానికి పంపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. నేడు తొలుత తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో పర్యటించనున్న కోవింద్ ఆ తర్వాత వరుసగా అన్ని రాష్ట్రాలను చుట్టేయనున్నారు.
నేడు యూపీ రాజధాని లక్నో వెళ్లనున్న ఆయనకు ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్ యోగీ ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కోవింద్ విందు ఇవ్వనున్నారు. విందులో భాగంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని ఆయన ఎమ్మెల్యేలను కోరతారట. ఆ తర్వాత అక్కడి నుంచే ఉత్తరాఖండ్ వెళ్లనున్న కోవింద్ అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు విందు ఇవ్వనున్నారు. ఈ నెలాఖరు దాకా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్న కోవింద్... వచ్చే నెల తొలి వారంలో తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటిస్తారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటన అనంతరం ఆయన తమిళనాడు - కర్ణాటక - కేరళ తదితర రాష్ట్రాలకు కూడా వెళతారని సమాచారం. జూలై 17న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుండగా, అప్పటిదాకా కూడా ఆయన తన ప్రచార పర్వాన్ని కొనసాగిస్తారని ఎన్డీఏ వర్గాలు చెబుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/