బాబ్రీ మసీదును ఎవరు ధ్వంసం చేశారు? కరసేవకులను ఎవరు రెచ్చగొట్టారు? ఈ వివాదంపై కొత్త కామెంట్ చేశారు మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి. బాబ్రీ మసీదును కూల్చేందుకు కరసేవకులను రెచ్చగొట్టింది తానే అని రామ్ విలాస్ స్పష్టం చేశారు. 1992, డిసెంబర్ 6న జరిగిన సంఘటనలను ఆయన గుర్తు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్‌కే అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషితో పాటు మరో 13 మందిపై కుట్ర కేసులు ఉన్నాయి. అందులో రామ్ విలాస్ కూడా ఉన్నారు.
ఇటీవల కోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ ఎంపీ రామ్ విలాస్ తాజాగా మీడియాతో మాట్లాడారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు అద్వానీకి సంబంధంలేదని స్పష్టం చేశారు. మసీదును కూల్చివేసేందుకు తానే ముందు ఉండి నడిచానని, కరసేవకులను కూడా తానే ఆదేశించినట్లు తెలిపారు. బాబ్రీ మసీదు కేసులో జోషి, అద్వానీలపై కుట్ర కేసు వేయడం దారుణమన్నారు. ఆ రోజున సంఘటనలను వివరిస్తూ తాను కరసేవకులను విధ్వంసానికి ప్రేరేపిస్తుంటే, అద్వానీ, జోషీలు మాత్రం కరసేవకులను శాంతింపచేసేందుకు ప్రయత్నించారన్నారు. ఏక్ దక్కా ఔర్ దో, బాబ్రీ మస్జిద్ కో తోడో అంటూ కరసేవకులకు ఆదేశాలు ఇచ్చినట్లు మాజీ ఎంపీ రామ్ విలాస్ చెప్పారు. బాబ్రీ మసీదు సమీపంలో ఉన్న వివాదాస్పద 67 ఎకరాల భూమిని రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగించారని ఆయన డిమాండ్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/