పెద్దిరెడ్డి నియోజకవర్గం మారుతున్నారా ?

Update: 2021-10-31 03:30 GMT
వచ్చే ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం మారబోతోందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది పార్టీ వర్గాల్లో. ప్రభుత్వం పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎంఎల్ఏగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంతకుమ దు దశాబ్దాలుగా పీలేరుకు ప్రాతినిధ్యం వహించినా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పుంగనూరుకు మారాల్సొచ్చింది. అయితే రాబోయే ఎన్నికల్లో పెద్దిరెడ్డి రాజంపేట నియోజకవర్గానికి మారబోతున్నట్లు పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది.

ఇంతకీ విషయం రాబోయే ఎన్నికల్లో పెద్దిరెడ్డి పోటీ అసెంబ్లీ నుండి పార్లమెంటుకు షిఫ్టవబోతోందట. అంటే ఇన్ని సంవత్సరాలు అసెంబ్లీకి మాత్రమే పోటేచేసిన పెద్దిరెడ్డి రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తారట. ఇపుడు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గానికి పెద్దిరెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజంపేటకు తండ్రి పెద్దిరెడ్డి పోటీచేస్తే, పుంగనూరు అసెంబ్లీకి కొడుకు మిథున్ రెడ్డి పోటీచేస్తారట.

ఇంతకీ ఎందుకీ మార్పు అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రకారమే ఈ మార్పు జరగబోతోందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏర్పాటు చేయబోయే మంత్రివర్గంలో యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట. అందులోను వయసులో తనకన్నా తక్కువ ఉన్నవారిని తీసుకుంటే అందరినీ కమాండ్ చేయటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని జగన్ భావిస్తున్నారట. ఇప్పటి మంత్రివర్గంలో అన్నీ వయసుల వారు ఉన్నారు.

మంత్రివర్గంలో పెద్దిరెడ్డి, బొత్సా వయసు 60 దాటిపోయింది. ఇక నారాయణస్వామి, కృష్ణదాసు, పినిపే విశ్వరూప్ లాంటి వాళ్ళు 60కి దగ్గరలో ఉన్నారు. మిగిలిన వారిలో అత్యధికులు దాదాపు జగన్ వయసున్నవారే. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఫైట్ కాస్త టైట్ గా ఉండచ్చని జగన్ అనుకుంటున్నారట. అందుకనే పెద్దిరెడ్డి లాంటి పవర్ ఫుల్ నేతలు పార్లమెంటుకు పోటీచేస్తే ఒకేసారి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయగలరు. అందుకనే పెద్దిరెడ్డిని లోక్ సభకు పోటీచేయించాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం.

తొందరలో చేయబోయే మంత్రివర్గ ప్రక్షాళనలో గనుక నూరుశాతం కొత్తవారిని తీసుకుంటే పెద్దిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. అంటే అపుడు పెద్దిరెడ్డి లోక్ సభ పోటీచేసే విషయంలో కాస్త క్లారిటి వస్తుందని పార్టీలో చర్చ జరుగుతోంది. మరి మంత్రవర్గంలో జరగబోయే ప్రక్షాళన విషయంలోనే ఆసక్తి పెరిగిపోతోంది. ఇదే సమయంలో జగన్ ఆలోచనలతో పెద్దిరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.




Tags:    

Similar News