సామాజిక సేవ చేస్తే శిక్ష తగ్గించాలా...?

Update: 2015-04-09 11:06 GMT
సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణంలో దోషిగా తేలిన రామలింగరాజు తనకు తక్కువ శిక్ష వేయాలని జడ్జిని కోరారు.  అందుకుగాను ఆయన తన కుటుంబపరిస్థితులు... తనకున్న బాధ్యతలు... తాను గతంలో చేసిన సేవాకార్యక్రమాలు వంటివన్నీ జడ్జి ఎదుట వల్లెవేసి శిక్ష తగ్గించాల్సిందిగా ప్రాథేయపడ్డారు.

    సత్యం కుంభకోణంలో రామలింగరాజు తో సహా పది మందిని కోర్టు దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసు తీవ్రతను బట్టి దోషులకు కఠిన శిక్ష విధించాలని సీబీఐ న్యాయవాది వాదించారు. వెంటనే రామలింగరాజు న్యాయమూర్తికి తన అభ్యర్ధన వినిపించారు. తనకు వృద్దులైన తల్లిదండ్రులు ఉన్నారని,పిల్లలు ఉన్నారని, వారిని పోషించుకోవల్సి ఉందని చెప్పారు. తాను గతంలో నిర్వహించిన వివిధ సేవ,సామాజిక కార్యక్రమాలను కూడా పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించాలని ఆయన కోరడం విశేషం. బిజినెస్‌ స్కూల్‌, ఇఎమ్‌ఆర్‌ఐ, 108 వంటి సర్వీసులను నిర్వహించానని అన్నారు. మూడున్నరేళ్లుగా  జైలులో ఉంటూ మానసిక క్షోభ అనుభవించానని కూడా ఆయన తెలిపారు.ఈ నేపద్యంలో తనకు శిక్ష తగ్గించాలని ఆయన కోరారు. అయితే జడ్జి మాత్రం కేసు తీవ్రతను బట్టి ఆయనకు ఏడేళ్ల శిక్ష విధించడం విశేషం.

    మరోవైపు సామాజిక సేవ చేశాను కాబట్టి శిక్ష తగ్గించాలి అని కోరడం ఎంతవరకు సబబనేది అంతా ఆలోచించాల్సిందే. సామాజిక సేవ చేసిన వారు నేరాలు చేస్తే వారికి శిక్షలు పడలేదా... మొత్తానికి రామలింగరాజు తాను చేసిన సోషల్‌ సర్వీసును చూపించి కోర్టులోనూ తన బుర్రను ఉపయోగించాలని చూడడంతో అంతా ఆశ్చర్యపోయారు.

Tags:    

Similar News