హీరోయిన్ తో సెల్ఫీ తీసుకొని బుక్ అయిన సీఎం

Update: 2015-11-21 04:59 GMT
అత్యుత్తమ స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తాము ఉన్న స్థానం ప్రజలు కట్టబెట్టిందన్న విషయం  వారు మర్చిపోకూడదు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్నది ప్రజల తరఫున అన్నది మర్చిపోయి.. వ్యక్తిగత ఇష్టాల్ని ప్రదర్శిస్తే.. లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకున్నట్లే. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్న ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్. తాజాగా ఆయన ప్రముఖ బాలీవుడ్ నటి కరీనాకపూర్ తో సెల్ఫీ తీసుకోవటం చిక్కుల్లో పడేసింది.

చిత్రం కాకుంటే.. ఒక ముఖ్యమంత్రిని కలవటం ఒక బాలీవుడ్ నటీమణి గొప్పగా భావించి.. సెల్ఫీ తీసుకోవటం బాగుంటుంది కానీ.. స్వయంగా సీఎమ్మె.. బాలీవుడ్ భామను కలిసిన సందర్భంగా సెల్ఫీ తీసుకోవటం ఇప్పుడు వివాదంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితుల్ని పెద్దగా పట్టించుకోకుండా.. వాటి గురించి స్పందించని ముఖ్యమంత్రి బాలీవుడ్ భామ కరీనాకపూర్ తో సెల్ఫీ దిగటంపై ప్రజలు మండిపడుతున్నారు.

బాలల హక్కుల కోసం రాష్ట్ర మహిళ.. శిశు సంక్షేమ శాఖ.. యూనిసెఫ్ వారు కలిసి బాలీవుడ్ నటిమణి కరీనాకపూర్ తో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ హాజరయ్యారు. వచ్చిన ఆయన హుందాగా కూర్చొని... నాలుగు మంచి మాటలు చెప్పి వెళితే సరిపోయేది. అందుకు భిన్నంగా.. కరీనాతో కలిసి సెల్ఫీ దిగటంపై మండి పడుతుననారు. ఓ పక్క రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడి కిందామీదా పడుతుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి బాలీవుడ్ నటితో సెల్ఫీలు దిగటం ఏమిటని మండి పడుతున్నారు.
Tags:    

Similar News