రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత. పైగా 2003 నుంచి అప్రతిహతంగా చత్తీస్ ఘడ్ ను పాలిస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి. వరుసగా మూడు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. మరోసారి గెలిచేందుకు సమాయత్తమవుతున్నారు. ఆయనే రాజకీయ దురంధరుడు రమణ్ సింగ్. అయితే చత్తీస్ ఘడ్ ఎన్నికల వేళ ఆయన చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది.
రమణ్ సింగ్ తాజాగా చత్తీస్ ఘడ్ ఎన్నికల వేళ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చారు. ఆయన రాజ్ నందగావ్ నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నారు. రమణ్ సింగ్ వెంట ఆయన భార్య వీణా సింగ్ తో పాటు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ - బీజేపీ చత్తీస్ ఘడ్ ఇన్ చార్జి అనిల్ జైన్ - ఇతర పార్టీ నేతలు కలెక్టరేట్ కు తరలివచ్చారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం 66 ఏళ్ల చత్తీస్ ఘడ్ సీఎం రమణ్ సింగ్.. తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన 46 ఏళ్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాళ్లకు మొక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజకీయాల్లో - అనుభవంలో ఎంతో సీనియర్ అయిన రమణ్ సింగ్ ఇలా చేయడం షాక్ కు గురిచేసింది.
యోగి ఆదిత్యనాథ్ 1972లో జన్మించారు. కానీ రమణ్ సింగ్ 1970లోనే భారతీయ జన్ సంఘ్ లో చేరి 1977లో ఆ పార్టీ యువ విభాగ అధ్యక్షుడయ్యారు. యోగి అంత చిన్నవాడైనా రమణ్ సింగ్ ఇలా చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.. నామినేషన్ వేసిన అనంతరం సభలో రమణ్ సింగ్ - యోగి పాల్గొని మాట్లాడారు. వీరిద్దరూ కలిసి పలు బహిరంగ సభల్లో కూడా పాల్గొని ప్రసగించారు. రమణ్ సింగ్ ను గెలిపించాలని యోగి పిలుపునిచ్చారు. చత్తీస్ ఘడ్ లో నవంబర్ 12న మొదటిదశ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 సీట్లు ఉన్నాయి.