ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగటం మామూలే. కానీ.. ఈ ఏడాది పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు.. మూడు రోజుల క్రితం స్వామివారిని మోహిని అవతారంలో తయారు చేసిన సమయంలో.. ఒక రామచిలుక గర్భ గుడిలోకి రావటం సంచలనమైంది.
తాజాగా శ్రీవారి ఆలయ ప్రధాన పూజారి రమణ దీక్షితులు తీసుకున్న ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. విశిష్టమైన గరుడసేవలో కాంతిపుంజం ఒకటి కనిపించిందని.. తన సెల్ ఫోన్ లో తీసిన ఫోటోలో ఈ అంశం స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు.
ఆదివారం రాత్రి గరుడ వాహనంపై తన సెల్ ఫోన్ లో తీసిన ఫోటోలో ఒక కాంతిపుంజం స్పష్టంగా కనిపించిందని ఆయన చెబుతున్నారు. తన వాదనకు బలం చేకూరుస్తూ ఆయన తన సెల్ ఫోన్ ఫోటోను ఇచ్చారు. ఫోటోలో ఏదైనా లోపం ఉంటే.. ఫోటోమొత్తంలో కనిపిస్తుంది కానీ.. శ్రీవారి ముఖం వద్ద మాత్రమే కాంతి పుంజం ఉండటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.