రివ‌ర్స్ అయిన చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్‌

Update: 2016-06-01 12:57 GMT
వైకాపా అధినేత వైఎస్‌ జ‌గ‌న్ సొంత జిల్లాలో ఆ పార్టీకి చెక్ చెప్పేందుకు చంద్ర‌బాబు ప‌క్కా ప్లానింగ్‌ తో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు తెర‌లేపారు. జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో వైకాపా 10కి 9 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించింది. జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాల్లో కూడా వైకాపా అభ్య‌ర్థులే విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌డ‌ప జిల్లాలో పాగా వేయాల‌ని భావించిన చంద్ర‌బాబు ఆపరేష‌న్ ఆక‌ర్ష్ ప్లాన్‌ లో జిల్లాలో వైకాపా బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న జ‌మ్ముల‌మ‌డుగుపై దృష్టి కేంద్రీక‌రించారు.

 జ‌మ్ముల‌మ‌డుగు వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడు ఎమ్మెల్సీ నారాయ‌ణ‌రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీ ఎంట్రీని మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డితో పాటు ఆయ‌న వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకించింది. ఇద్ద‌రు బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఒకే పార్టీలో ఉంచితే పార్టీ ప‌రంగా తిరుగులేద‌ని చంద్ర‌బాబు వేసిన మాస్ట‌ర్ ప్లాన్ ఇప్పుడు రివ‌ర్స్ అయ్యింది. జ‌మ్ముల‌మ‌డుగులో ఎప్ప‌టి నుంచో ఉప్పు నిప్పుగా ఉంటున్న ఆదినారాయ‌ణ‌రెడ్డి - రామ‌సుబ్బారెడ్డి మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు.

 తాజాగా మ‌హానాడుకు ముందు ఏపీలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన మినీ మ‌హానాడు జ‌మ్ముల‌మ‌డుగులో మాత్రం నిర్వ‌హించ‌లేదు.  అక్కడ మినీ మహానాడును జరపడానికి రామ‌సుబ్బారెడ్డి - ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గాలు ప్ర‌య‌త్నించాయి. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో గొడ‌వ‌లు జ‌రిగే ప‌రిస్థితి ఉంద‌ని ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు చంద్ర‌బాబుకు ఆదేశాలు ఇవ్వ‌డంతో ఆయ‌న జ‌మ్ముల‌మ‌డుగులో మినీ మ‌హానాడు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేశారు.

 దీంతో జ‌మ్ముల‌మ‌డుగులో పార్టీకి తిరుగులేకుండా చేయాల‌ని భావించిన చంద్ర‌బాబుకు ఇప్పుడు పెద్ద చిక్కు వ‌చ్చిప‌డింది. మొద‌టికే మోసం వ‌చ్చింది. ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య వైరం రోజు రోజుకు త‌వ్ర‌మ‌వుతుండ‌డంతో భ‌విష్య‌త్తులో ఇక్క‌డ టీడీపీలో ఎలాంటి ర‌ణ‌రంగం జ‌రుగుతుందో అని జిల్లా రాజ‌కీయాల్లో అంద‌రూ ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News