టీడీపీని వదిలి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి.. పసుపు పార్టీపై మాటల దాడిని పెంచుతూనే ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు లోకల్ ఎలక్షన్లను వాయిదా వేయించారంటూ ఫైరయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. "లోకల్‌బాడీ ఎలక్షన్లు సరైన సమయంలో జరిగితే కేంద్ర నుంచి రాష్ట్రానికి రావలసిన ఐదు వేల కోట్ల నిధులు వస్తాయి. ఆగిపోతే ఆ డబ్బులు పోతాయి. పోయిన డబ్బులు తిరిగి ఎవరిస్తారు? రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదు. అయినా దాన్ని సాకుగా చెబుతున్నారు. ఇప్పుడు సీఎం జగన్‌ను తిడుతున్న టీడీపీ నాయకులు.. నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు" అంటూ మండిపడ్డారు. టీడీపీకి విలువలు లేవు కాబట్టే వదిలేశానని పంచ్ పేల్చారు.
విమర్శలతో పాటు ఓ సీక్రెట్ కూడా రామసుబ్బారెడ్డి చెప్పారు. చంద్రబాబు కుమారుడు లోకేష్.. గతం లో కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించడానికి అందరినీ డబ్బుతో కొనమన్నారని... వైసీపీకి మెజారిటీ ఉన్నా డబ్బులు పంచి వివేకాను ఓడించారని రామసుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా టీడీపీ మీద నమ్మకం లేకే మంచి నాయకులు లోకల్ ఎలక్షన్లలోకి దిగలేదని... రాష్ట్రంలోని టీడీపీ కార్యకర్తల జీవితాల్లో అయోమయం నెలకొందని అన్నారు. సీఎం జగన్ మీద బురద చల్లాలని చూస్తే దేవుడే వారికి బుద్ధి చెబుతాడంటూ రామసుబ్బారెడ్డి ఆ పైవాడిపై భారం వేసి ప్రెస్‌మీట్ ముగించారు.