ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణపట్నం పోర్టు పరిధిని తగ్గిస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనితో రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు అవరోదాలు తొలిగినట్లే అని అనుకోవచ్చు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టుకు విశేష అధికారాలు కట్టబెట్టారని పోర్టు పరిధిలోని 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్తగా ఎటువంటి పోర్టు నిర్మాణం చేపట్టకూడదని వారు చేసుకున్న ఒప్పందంలో ప్రధాన క్లాజుగా ఉంది. దీంతో అక్కడ వేరే పోర్టులు ఏర్పాటు కాకుండా కృష్టపట్నం పోర్టు కంపెనీకి బాబు ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది.
దీంతో తాజాగా ఆ ఒప్పందంలో ఉన్న క్లాజును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు కూడా ఇచ్చింది . ఇక ఈ పోర్టు వ్యవహారానికి వస్తే కృష్ణపట్నం పోర్టు నిర్మాణం సమయంలో ఆ పోర్టు పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి వచ్చిన తర్వాత 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంకో పోర్టు ఇవ్వొచ్చని 1994లో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ తప్ప మరో సంస్థకు 30 కిలోమీటర్ల పరిధిలోపు ఇంకో పోర్టు నిర్మించే హక్కు లేదంటూ 2004లో ఉత్తర్వులిచ్చారు.
అయితే , ఆ తర్వాత కూడా ఈ పోర్ట్ కి సంబంధించి పలు మార్పులు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అప్పట్లోనే ఈ వ్యవహారంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా ఒక సంస్థకు ప్రత్యేక హక్కులు కట్టబెడుతూ, ఇంకో పోర్టు నిర్మాణానికి హక్కులు లేకుండా చేసే హక్కు ఎవరికీ లేదంటూ కేంద్రం తెలిపింది. ఒకవేళ ఇలాంటి నిబంధన పెట్టినా అది చెల్లదని చాలా స్పష్టంగా చెప్పింది . ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టుకు అటూ ఇటూ 30 కిలోమీటర్ల పరిధిలో ఇంకో కొత్త పోర్టు నిర్మాణం కుదరదన్న షరతును రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం.