సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ.. తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. అయితే.. ఈ రాజీనామాను పార్టీ ఇంకా ఆమోదించలేదు. ఆయన్ను బుజ్జగించేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. రాహుల్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటూ ఆయన తన పట్టు నుంచి పక్కకు తప్పుకోవటం లేదు.
రాహుల్ అలకతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవటానికి అర్హత ఉన్నోళ్లు.. ఆ ఛరిష్మా ఉన్నోళ్లు కనిపించని పరిస్థితి. దీంతో.. ఏదోలా రాహుల్ చేతిలోనే పగ్గాలు ఉంచాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటితో విసిగిపోయారో.. లేక తనదైన జీవితాన్ని గడపాలని అనుకున్నారో కానీ.. ఎవరికి చెప్పాపెట్టకుండా ఆయన విదేశాలకు వెళ్లిపోయారు.
ఫారిన్ ట్రిప్ నకు వెళ్లిన విషయం బయటకు రావటంతో కాంగ్రెస్ నేతలు అవాక్కు అయ్యే పరిస్థితి. ఇదిలా ఉంటే.. రాహుల్ విషయాన్ని తాజాగా ప్రస్తావించి అదిరిపోయే పంచ్ వేశారు కేంద్రమంత్రి రామ్ దాస్ అధవాలే. రాహుల్ త్వరగా పెళ్లి చేసుకోవాలన్నారు. పెళ్లి చేసుకుంటే రాహుల్ మరింత రాటుదేలుతారని.. అందుకే ఆయన వెంటనే పెళ్లి చేసుకోవాలని సూచించారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ చాలా కష్టపడ్డారని.. ఎంతగానో ప్రచారం చేశారన్నారు. తానుపెళ్లి గురించి రాహుల్ ను పలు మార్లు ప్రశ్నించినప్పుడు.. తాను కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకున్నారని చెప్పినట్లు తెలిపారు. మరి.. కేంద్రమంత్రి చెప్పినట్లుగా పెళ్లి చేసుకొని రాటుదేలుతారా? లేదంటే.. తాను రాటుదేలటానికి ఇంకేమైనా ఐడియా రాహుల్ దగ్గర ఉందా? అన్నది ఆయన సమాధానం మీద ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు.