ఏపీలో ఇద్దరి పేర్లు చెప్పినంతనే ఆంధ్రా ప్రజలు మండిపడుతున్నారు. ఒకరు ప్రధాని మోడీ అయితే మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీని ఏదేదో చేస్తానని.. ఢిల్లీకి మించిన రాజధానిని అమరావతిలో కట్టిస్తామని.. అందుకు తాము అధికారంలోకి వచ్చినంతనే ఏపీకి అండగా నిలుస్తామంటూ తిరుపతి సాక్షిగా మోడీ హామీ ఇవ్వటం.. ప్రత్యేక హోదాకు అనుకూలంగా మాట్లాడటం తెలిసిందే.
నాలుగేళ్ల కాలంలో ఏపీకి మోడీ ఏం చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ఆయన చేసిందేమీ లేదు. మోడీని పక్కన పెడితే.. 2014 సార్వత్రిక ఎన్నికల వేళలో తాను అధికారంలోకి వస్తే చాలు.. ఏపీ రూపురేఖలు మొత్తాన్ని మార్చేస్తానని హడావుడి చేసిన చంద్రబాబు.. నాలుగేళ్ల కాలంలో ఏం చేసినా చేయకున్నా రూ.1.5లక్షల కోట్లు ప్రజల నెత్తి మీద మోపారని చెప్పాలి.
ఆయన చూపిస్తున్న అభివృద్ధికి ఆయన చేసిన అప్పును లెక్క తేలిస్తే.. ఏపీ ప్రజలకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన పాలనతో ఎంత నష్టం జరిగింది ఇట్టే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కొత్త పల్లవిని వినిపించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద మాట్లాడారు.ఈ సందర్భంగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఊహించని వ్యాఖ్య ఒకటి చేశారు.
తమ బ్యాట్స్ మెన్ చంద్రబాబు తమ జట్టులోని నుంచి వెళ్లిపోయారని.. జగన్ రావొచ్చని.. ఆయన వస్తానంటే తానే స్వయంగా అమిత్ షా.. మోడీలతో మాట్లాడతానని చెప్పారు. జగన్ కానీ తమ జట్టులోకి వస్తే.. ఆయన ఏపీకి సీఎం కావొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.
అథవాలే వ్యాఖ్యలు విన్న వారంతా విరుచుకుపడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బీజేపీ చేయాల్సిన అవసరం లేదని.. ఆయనకు ఆయనే సొంతంగా సీఎం కాగలిగిన సత్తా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బీజేపీ..టీడీపీ.. జనసేన మూడు కలిస్తేనే జగన్ కు.. కూటమికి మధ్య ఓట్ల శాతం చాలా స్వల్పమన్న విషయాన్ని మర్చిపోకూడదు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన పుణ్యమా అని ఏపీ ప్రజలకు జీవితానికి సరిపడ అనుభవాలు ఎదురయ్యాయి. ఇలాంటి వేళ.. బాబును గద్దె నుంచి దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.
మరోవైపు.. తాను ఎవరితోనూ జట్టు కట్టేది లేదన్న విషయాన్ని జగన్ స్పష్టం చేసిన తర్వాత కూడా అథవాలే.. జగన్ ను ఎన్డీయే కూటమిలోకి రావాలంటూ వ్యాఖ్యలు చేయటం సరికాదన్న వాదన వినిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు అమరావతి విషయంలో మోడీ సర్కారు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. అలాంటి వారు.. ఈ రోజున జగన్ తో జట్టు కడతామని చెప్పటమంటే.. కేవలంలో ఆయనకు ప్రజల్లో ఉన్న పలుకుబడే తప్పించి మరింకేమీ కాదు. అథవాలే మాటల్ని విన్నప్పుడు అనిపించేది ఒక్కటే.. జగన్ తో జట్టుకట్టాలన్న ఆలోచన బీజేపీ నేతలకు ఉందన్న విషయం అర్థమైనట్లే. కాకుంటే.. కమలనాథులతో కలిసి జర్నీ చేయాలన్న ఆలోచన జగన్ కు లేదన్న విషయాన్నిబీజేపీ నేతలు ఎందుకు పట్టించుకోవటం లేదు? జగన్ తనకు తానుగా సీఎం అయ్యే శక్తి ఉంది. ఆయనకు బీజేపీ అవసరం ఎంత మాత్రం లేదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.