జిన్నా ఫోటోపై రాందేవ్ లాజిక్ లా పాయింట్‌!

Update: 2018-05-09 10:45 GMT
మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో వివాదాల‌కు కొద‌వ ఉండ‌టం లేదు. తాజాగా అలాంటి వివాదం ఒక‌టి ఈ మ‌ధ్య‌న తెర మీకు వ‌చ్చింది. అలీగ‌ఢ్ ముస్లిం వ‌ర్సిటీలో మ‌హ్మ‌ద్ అలీ జిన్నా చిత్ర‌ప‌టం ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ పై ప్ర‌ముఖ యోగా గురువు రాందేవ్ బాబా త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

ముస్లింలు ఫోటోల‌కు.. విగ్ర‌హాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌ర‌ని.. అలాంట‌ప్పుడు జిన్నా ఫోటోకు అంత ప్రాధాన్య‌త ఎందుకు ఇస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. బిహార్ లోని న‌లందాలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ కొత్త లాజిక్ ను తెర మీద‌కు తీసుకొచ్చారు. జిన్నా ఫోటో ఏర్పాటు విష‌యంపై మ‌ద్ద‌తుగా వినిపిస్తున్న వాద‌న‌ను ఖండించేలా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి.

పాకిస్తాన్ వ్య‌వ‌స్థాప‌కుడు మ‌హ్మ‌ద్ అలీ జిన్నా ఆ దేశానికి గొప్ప వ్య‌క్తి కావొచ్చ‌ని.. భార‌త‌దేశ ఐక్య‌త‌.. స‌మ‌గ్ర‌త‌ను న‌మ్మే వారు ఎవ‌రూ జిన్నాను ఆద‌ర్శ వ్య‌క్తిగా భావించ‌కూడ‌ద‌న్నారు. ముస్లిం మ‌త‌స్తులు విగ్ర‌హాల‌కు.. చిత్ర‌ప‌టాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌ర‌ని.. అందులో భాగంగానే జిన్నా ఫోటోల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. మ‌రి.. దీనికి జిన్నా ఫోటో కోసం ప్ర‌య‌త్నిస్తున్న వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News