బాబాగారికి భ‌లే ఐడియా వ‌చ్చింది

Update: 2015-10-03 07:48 GMT
రాందేవ్ బాబా....యోగ గురువు గానే కాకుండా ప‌తాంజ‌లి ఉత్ప‌త్తుల సృష్టిక‌ర్త‌గా సుప‌ర‌చితులు. నిత్య‌జీవితంలో అవ‌స‌ర‌మైన ప్రొడ‌క్ట్‌ లన్నింటినీ విదేశీ స్థాయి క్వాలిటీతో స్వ‌దేశంలో త‌య‌రుచేసి అందించేందుకు ప‌తంజ‌లి స్టోర్స్‌ను ఏర్పాటుచేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చూపు కొత్త ప్రొడ‌క్ట్‌ పై ప‌డింది. నెస్లే కంపెనీ తయారు చేస్తున్న మ్యాగీ న్యూడల్స్‌లో ప్రమాదకర రసాయనాలున్నాయని పరీక్షలు నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో మార్కెట్ లో పెద్ద ఎత్తున గ‌గ్గోలు పుట్టి ఆ ఉత్ప‌త్తిని నెస్లే వెన‌క్కు తీసుకుంది. ఈ క్రమంలో మ్యాగీ మార్కెట్ లో కనుమరుగై నెలలు గడుస్తుంది.

అయితే మ్యాగీ నిర్ణ‌యం తర్వాత రసాయనాలు లేని మ్యాగీ అని మార్కెట్ లోకి వచ్చినా అంతకు ముందున్నంత క్రేజీ కొనుగోలు ఈ ప్రొడ‌క్ట్‌ ల‌కు లేదు. ఈ నేపథ్యంలో రామ్‌ దేవ్ బాబాకు చెందిన పతంజలి యోగా కేంద్రం పతంజలి బ్రాండ్ పేరుతో న్యూడల్స్‌ ను మార్కెట్ లోకి తేబోతుంది. ఇప్పటికే న్యూడల్స్‌ ను ఉత్పత్తిని ప్రారంభించిన పతంజలి యోగా కేంద్రం త్వరలోనే వీటిని మార్కెట్ లోకి రానుంది. అంద‌రికీ అందుబాటులో ఉండేలా 70 గ్రాముల ప్యాక్ రూ. 15కే మార్కెట్ లో లభించనుందని స‌మాచారం.
Tags:    

Similar News