త‌లాఖ్‌ పై రాందేవ్ బాబా మాట‌లు విన్నారా?

Update: 2016-10-17 08:56 GMT
వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్‌ పై బాబా రాందేవ్ స్పందించారు. ట్రిపుల్ తలాఖ్ అంశంపై ముస్లిం పెద్దలు ఆలోచించాలని కోరారు. మూడుసార్లు తలాఖ్ అని చెప్పి విడాకులు తీసుకోవడం దారుణమన్నారు. అలా చేస్తే మ‌హిళ‌ల‌ను గౌరవించినట్లు ఎలా అవుతుంద‌ని రాందేవ్ బాబా ప్ర‌శ్నించారు. ఇది మానవ హక్కులు - స్త్రీహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని గమనించాలని సూచించారు. ముస్లిం పెద్దలు స్త్రీలకు న్యాయం చేసేలా వ్యవహరించాలన్నారు.

ఇదిలాఉండ‌గా త‌లాఖ్‌ పై కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని నిరసిస్తూ ముస్లిం మ‌త‌పెద్ద‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసేందుకు ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ సిద్ధ‌మ‌య్యారు. కేంద్రం ముస్లింల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే ల‌క్ష్యంతో ముందుకు సాగుతోంద‌ని ఆరోపిస్తున్న ఓవైసీ ఈ క్ర‌మంలో త‌మ గ‌ళాన్ని వినిపించేందుకు ముస్లింలంతా ఒక్క‌తాటిపైకి రావాల‌ని ఆయ‌న పార్టీ కార్యక‌ర్త‌ల స‌మావేశంలో తెలిపారు. ఇదిలాఉండ‌గా  ముస్లిం చట్టాల్లో జోక్యం చేసుకోకూడదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కోరుతోంది. తమ చట్టాలను కోర్టులు మార్చలేవని కోర్టుకు స్పష్టం చేసింది. మ‌రోవైపు కేంద్రం భారత్ వంటి లౌకిక దేశంలో ట్రిపుల్ తలాఖ్‌ కు తావులేదని సుప్రీంకోర్టుకు తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News