ప్రముఖులు చూసి చాలామంది జెలస్ ఫీలవుతుంటారు. కానీ.. సామాన్యుడిగా బతకటంలో ఉండేంత హ్యాపీ.. సెలబ్రిటీ.. ప్రముఖులన్న ట్యాగ్ లైన్ తో అస్సలు ఉండనే ఉండదు. ఎప్పుడైతే అందరికంటే భిన్నమైన కేటగిరిలోకి వచ్చేస్తామో చాలానే ఆంక్షలు తెర మీదకు వచ్చేస్తాయి. తాజాగా దేశ ప్రధమ పౌరుడు.. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కుమార్తెకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం వచ్చింది.
ఆమె తన ఎయిర్ హోస్టెస్ జాబ్‌ను వదిలేసినట్లుగా పేర్కొన్నారు. రామ్ నాథ్ కుమార్తె స్వాతి.. సదూరప్రాంతాలకు ప్రయాణించే ఎయిర్ ఇండియా బోయింగ్ 777.. 787 ఎయిర్ క్రాఫ్ట్ లలో ఎయిర్ హోస్టెస్ గా సేవలు అందిస్తుంటారు. అయితే.. ఎప్పుడైతే తన తండ్రి కోవింద్ రాష్ట్రపతిగా నామినేట్ అయ్యారో అప్పటి నుంచి ఆమెకు భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి.
దీంతో.. రాష్ట్రపతిగా తన తండ్రి పేరు తెర మీదకు వచ్చిన నాటి నుంచి ప్రత్యేక కారణాలతో సెలవులో ఉన్నారు. తండ్రి రాష్ట్రపతి పదవికి అధికార పార్టీ అభ్యర్థిగా ఎప్పుడైతే పేరు బయటకు వచ్చిందో అప్పటి నుంచి లీవ్ లో ఉన్న ఆమె ఇప్పుడు తన జాబ్ ను వదులుకున్నారు. ప్రస్తుతం ఎయిరిండియా హెడ్ ఆఫీస్ లో కో ఆర్డినేషన్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.