మీడియా మొఘల్ రామోజీరావుకు ఒకేసారి ట్రిపుల్ ప్రమోషన్ రాబోతుందా....? రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం కలిసి ఆయనకు పెద్ద గౌరవమే ఇవ్వనున్నాయా...? పరిస్థితులన్నీ చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రం నుంచి పద్మ అవార్డులకు పంపించిన ప్రతిపాదనల్లో రామోజీరావు పేరును పద్మవిభూషణ్ కు ప్రతిపాదించారు. అయితే... రామోజీరావుకు ఇప్పటివరకు పద్మ అవార్డు రాలేదు. పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ ఆయన అందుకోలేదు. ఇప్పుడు నేరుగా పద్మ విభూషణ్ కు నామినేటయ్యారు. దేశంలో భారతరత్న తరువాత రెండో అతిపెద్ద గౌరవమైన దీనికి ఆయన నేరుగా నామినేటవడం విశేషం.
కాగా కేంద్రంలో మోడీ ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఆయనకు ఈ గౌరవం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాని మోడీతో ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో అంబానీలు, అదానీలకు కూడా రెండో వరుసలో సీట్లు కేటాయించినా రామోజీకి మాత్రం మొదటివరుసలో సీటుంచారు. ఇప్పుడు కూడా ఆయనకు నేరుగా పద్మవిభూషణ్ ప్రదానం చేసి అగ్రతాంబూలం ఇస్తారని తెలుస్తోంది.