రామోజీ గ్రూపుల అధినేత, మీడియా సంస్థలకు అధిపతి... రాజకీయ దర్శకుడు రామోజీరావుకు పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్వాప్తంగా ఆయన సుపరిచితుడే. ఎన్డీయే ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అంబాసిడర్ గానూ ఆయన్ను గుర్తించడం... ఎవరికీ సాధ్యం కాని రీతిలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లడం తెలిసిందే. ఈ వివరాలన్నీ ఆయన ఇప్పటికే ప్రధాని మోడీకి తెలియజేశారు కూడా. కాగా ఇంతకాలం అవార్డులు పురస్కారాల జోలికెళ్లని రామోజీ ఒక్కసారిగా పద్మవిభూషణ్ అందుకోనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు రామోజీతో పాటు పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులు వరించాయి. ప్రముఖ సినీనటుడు రజనీకాంత్, ప్రముఖ నృత్యకళాకారిణి యామినీ కృష్ణమూర్తిలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషన్ పురస్కారాలకు ఎంపిక చేసింది. అలాగే ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కు - గాయకుడు ఉదిత్ నారాయణ్ కు కూడా పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా రంగంలో సైనా నెహ్వాల్ కు పద్మ భూషణ్ అవార్డు లభించింది. సినీ రంగంలో అనుపమ్ ఖేర్ కు పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. 2016 సంవత్సరానికి గాను పద్మ అవార్డులను కేంద్రం ఈ రోజు ప్రకటించింది. మాజీ కాగ్ వినోద్ రాయ్ కు పద్మ భూషణ్ అవార్డు లభించింది.