తెలుగు రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రామోజీ.. జగన్ భేటీలకు సంబంధించి ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. గురువారం రామోజీ ఫిలిం సిటీలోని రామోజీరావు ఇంటికి జగన్ వెళ్లటం తెలిసిందే. రామోజీ ఇంటికి వెళ్లే సమయంలో తనతో అత్యంత సన్నిహితులైన భూమాన కరుణాకర్ రెడ్డి.. విజయసాయిరెడ్డిలను జగన్ తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.
జగన్ రాక పట్ల సానుకూలంగా స్పందించటమే కాదు.. తన అప్యాయతతో జగన్ ను రామోజీ ఆశ్చర్యపరిచారని చెబుతున్నారు. ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించేందుకు రామోజీ ఇంటి బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. రామోజీ ఇంట్లో కొద్ది గంటల పాటు జగన్ గడిపినట్లు తెలుస్తోంది.
అన్నింటికి మించి.. రామోజీ.. జగన్ ల మధ్య ఏకాంత చర్చలు దాదాపు గంట పాటు సాగినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇద్దరు ముఖాముఖిన కూర్చొని పలు విషయాలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. వీటి వివరాలు కచ్ఛితంగా బయటకు వచ్చేవి కావు. రామోజీతో తన భేటీ గురించి జగన్ చెప్పుకునే పరిస్థితి ఉండదు. రామోజీ నమ్మకాన్ని పొందేందుకు దొరికిన అవకాశాన్ని జగన్ వదులుకునే అవకాశమే లేని నేపథ్యంలో.. తమ ఏకాంత చర్చల గురించి బయటకు చెప్పే ఛాన్స్ లేదనే చెప్పాలి. మొత్తంగా ఇద్దరు ప్రముఖ ప్రత్యర్థుల మధ్య ఏకాంతంగా గంటపాటు చర్చలు జరగటం చూస్తే.. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయంలో చాలానే మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా? అన్న ప్రశ్న తలెత్తక మానదు.