సూటుబూటు వేసుకున్న రామోజీని చూశారా?

Update: 2015-12-07 15:27 GMT
అవును.. మీడియా మొఘల్ గా వ్యవహరించే ఈనాడు రామోజీరావును తలుచుకున్న వెంటనే మదిలో మెదిలే రూపం.. వైట్ అండ్ వైట్ లో గుర్తుకు వస్తారు. తెల్ల షూ దగ్గర నుంచి తెల్ల ఫ్యాంట్.. తెల్ల చొక్కాతో ఆయన దర్శనమిస్తారు. అంతకు భిన్నంగా ఆయన కనిపించిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి రామోజీ తాజాగా.. అందుకు పూర్తి భిన్నమైన రూపుతో కనిపించటం గమనార్హం.

సూటు వేసుకున్న ఆయన.. మెడలో టై పెట్టుకొని ప్రధాని మోడీని ఢిల్లీలో కలవటం.. ఆయనతో కాసేపు గడపటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ప్రధాని మోడీని ఆయన ఎందుకు కలిసారన్న విషయం కంటే.. ఆయన డ్రెస్సింగ్ టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉండటం గమనార్హం. ఇంతకాలం వైట్ అండ్ వైట్ లో కనిపించిన పెద్ద మనిషి.. ఉన్నట్లుండి సూటు వేసుకొని మరీ వచ్చి ప్రధానిని కలవటం కాస్తంత చిత్రమైన విషయమే. ఇక.. ప్రధాని మోడీని ఆయన ఎందుకు కలిశారన్న దానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

వాటిని పక్కన పెట్టి.. అధికారికంగా రామోజీ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం అయితే.. ఈనాడు.. ఈ టీవీ సంస్థల అధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ ఆసుపత్రి కార్యక్రమాల్ని వివరించారు. ఇందుకోసం ఆయన కొన్ని డీవీడీలు.. పుస్తకాలు మోడీకి అందించారు. తన మానస పుత్రిక అయిన స్వచ్ఛభారత్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న రామోజీని మోడీ అభినందించినట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ అంశం కాకుండా.. మల్టీ మీడియాకు సంబంధించిన వివరాల్ని మోడీకి వెల్లడించి..వాటికి సంబంధించిన పుస్తకాలు ప్రధానికి అందజేయటం గమనార్హం. మరి.. తాజా భేటీ అసలు మర్మం ఏమిటో..?
Tags:    

Similar News