విజయసాయికి రాము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడా?

Update: 2022-11-11 15:30 GMT
రాజకీయాలో గిఫ్టులు వేరేగా ఉంటాయి. అవి బాంబుల్లా పేలతాయి. అందువల్లనే ఆ మాధ్యన తెలంగాణా సీఎం కేసీయార్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పారు, చేసి చూపించారు. ఇపుడు మరోసారి రిటర్న్ గిఫ్ట్ టాపిక్ చర్చకు వస్తోంది. వైసీపీ ఎంపీ కీలక నేత విజయసాయిరెడ్డికి టైం చూసి మరీ మీడియా మొఘల్ రామోజీరావు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని అంటున్నారు.

విజయసాయిరెడ్డి మీద ఈనాడు  రామోజీరావు ఎందుకు ఫోకస్ పెడతారు, దేనికి టార్గెట్ చేస్తారు అంటే దానికి కొంత ఫ్లాష్ బ్యాక్  కధ ఉంది. ఆ మధ్యన విశాఖలో భూముల దందాలో అక్కడ  చాన్నాళ్ళ పాటు వైసీపీ బాధ్యునిగా ఉన్నఎంపీ  విజయసాయిరెడ్డి పాత్ర ఉందని ఈనాడులో బ్యానర్ ఐటెమ్స్ గా వార్తా కధనాలు వచ్చాయి. దాని మీద మండిపడిన విజయసాయిరెడ్డి నేరుగా విశాఖలోనే  మీడియా మీటింగ్ పెట్టి మరీ రామోజీరావుని ఘాటుగా విమర్శించారు.

రామోజీరావుని రామూ అంటూ సంభోదిస్తూ వ్యక్తిగతంగా కూడా ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. తానూ కూడా మీడియా ఫీల్డ్ లోకి వచ్చి సత్తా చాటుతాను అని సవాల్ కూడా చేశారు.  ఇలా విజయసాయిరెడ్డి తన దూకుడు కొనసాగిస్తే  చాలా మౌనంగా ఉంటూ వచ్చిన రామోజీరావు ఇపుడు తన టైం వచ్చింది అంటున్నారు. అందుకే ఆయన ఢిల్లీ లిక్కర్ స్కాం లో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి పాత్ర ఎలా ఉంది అన్నది సంపూర్ణమైన సంచలన వార్తా కధనాన్ని ప్రచురించి వైసీపీ బిగ్ షాట్ కి గట్టి  షాక్ ఇచ్చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి పాత్ర మాత్రమే కాకుండా  నేరుగా అల్లుడు రోహిత్ రెడ్డి  కూడా ఉందని పేర్కొన్నారు. ఇక ఇపుడు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. అయినా ఈ కేసుతో తమ ఎంపీకి  ఏ మాత్రం సంబంధం లేదని వైసీపీ వారు చెబుతున్న నేపధ్యం ఉంది. అందుకే అన్ని వివరాలతో ఈనాడు అతి పెద్ద కధనమే ప్రచురించింది.

ఇక ఈనాడు కధనం ప్రకారం చూస్తే ఈ కేసులో  శరత్ చంద్రారెడ్డి కంపెనీ ట్రైడెంట్ చాంపర్ లిమిటెడ్ కి ఎంత సంబంధం ఉందో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఆద్వర్యంలో నడిచే ఆర్పీయార్ సన్స్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెద్ కి కూడా అంతే ప్రమేయం ఉందని ఆ కధనం రాసుకొస్తోంది. ఇక ఆర్ పీయార్ సన్స్ అడ్వైజర్స్ సంస్థ 99.99 శాతం వాటాను అందులో కలిగి ఉందని, అలా  ట్రైడెంట్ చాంపర్ లిమిటెడ్ కి మాతృ సంస్థగా ఉందని కూడా పేర్కొంది.

ఇక రోహిత్ రెడ్డి చూస్తే 2021   ఏప్రిల్ 21 నుంచి ఆర్ పీయార్ సంస్థకు  డైరెక్టర్ గా ఉన్నారని వెల్లడించింది. అంతే కాదు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారని వివరాలు రాసుకొచ్చింది. ఇపుడు చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం లో కీలకమైన పాత్ర పోషించిన శరత్ చంద్రా రెడ్డి  ట్రైడెంట్ చాంపర్ లిమిటెడ్ నేరుగా విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డిదేనని, అలాగే  ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కి చెందినదే అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చేసి ఎంపీ గారిని బాగానే ఇరికించేసింది. మరి దీని మీద విజయసాయిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News