కంగారు పడాల్సిన అవసరం లేదు. మీడియా మొఘల్.. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆరోగ్యంగానే ఉన్నారు. మరి హెడ్డింగ్ లో అంబులెన్స్ అని ఎందుకంటారా? నిజమే.. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఆయన్ను అంబులెన్స్ లో పంపటమే ఈ వార్తకు మూలమైంది. ఇంతకీ.. అలా ఎందుకు జరిగింది? ఎప్పుడు జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..
కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురై యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. అనంతరం బాత్రూంలో ఆయన జారి పడటంతో ఫ్యాక్చర్ కావటంతో గడిచిన కొద్దిరోజులుగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ప్రముఖులు పరామర్శించిన వైనాన్ని పేపర్లలో వార్తలు వచ్చాయి. అనారోగ్యానికి గురైనప్పటి నుంచి ఆయనకు చెందిన అమీర్ పేట్ ఇంట్లో ఉంటున్నారు. ఫ్యాక్చర్ నుంచి పూర్తిగా కోలుకోనప్పటికీ.. తనకెంతో ఇష్టమైన ఫిలింసిటీ ఇంటిని వదిలి ఉండటాన్ని ఆయన అస్సలు ఇష్టపడట లేదట. ఎంత త్వరగా అయితే.. అంత త్వరగా ఫిలింసిటీకి వెళ్లిపోవాలని కోరుకుంటున్నారట. అయితే.. వైద్యుల సూచన మేరకు మొన్నటి వరకూ అమీర్ పేట ఇంట్లోనే ఉన్న ఆయన.. తాజాగా ఫిలింసిటీకి షిఫ్ట్ అయ్యారు.
పెద్ద వయస్కుడైన రామోజీని అమీర్ పేట నుంచి ఫిలింసిటీకి తీసుకెళ్లాల్సి రావటం.. ఫ్యాక్చర్ అయిన వేళ.. ఏ చిన్న తేడా జరిగినా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండటంతో.. ఆయన్ను ఎలా తీసుకెళ్లాలన్న విషయం మీద రామోజీ క్యాంప్ పెద్ద ఎత్తున ఆలోచనలు జరిపినట్లుగా తెలుస్తోంది. చివరకు వైద్యుల సూచన మేరకు.. మిగిలిన రవాణా పద్ధతుల్ని వదిలేసి.. రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో ఫిలింసిటీలోని ఇంటికి తీసుకెళ్లాలని డిసైడ్ చేశారు.
చివరకు.. గురువారం ఉదయం ఆయన్ను అమీర్ పేట నుంచి ఫిలింసిటీకి మార్చినట్లుగా చెబుతున్నారు. అంబులెన్స్ లో తీసుకెళ్లే సమయంలో అనుకోనిదేమైనా జరిగితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో రెండు అంబులెన్స్ ల్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక జాగ్రత్తల నడుమ.. అనుకున్న సమయానికి కంటే ఆలస్యంగా (అంబులెన్స్ ను కాస్త నెమ్మదిగా తీసుకెళ్లటం వల్ల) ఫిలింసిటీకి చేరుకున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. పెద్దాయనకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంటికి చేరుకున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/