హీరోయిన్ , కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఫైర్ బ్రాండ్ రమ్యను సెలబ్రిటీలు, నెటిజన్లు చెడుగుడు ఆడేస్తున్నారు. కర్నాటక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ బెంగళూరులో నవకర్నాటక నిర్మాణ పరివర్తన సభను ఏర్పాటు చేసింది. ఆ సభలో పీఎం మోడీ మాట్లాడుతూ రైతులపై కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఆ పార్టీ రైతుల్ని పట్టించుకోకపోవడంతో కర్నాటకలో 3,500రైతులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆత్మహత్యలుండవ్, వారికి తమ పార్టీ అండగా నిలుస్తుంది. ఖరీఫ్ పంటలతో పాటు మరికొన్ని పంటలకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ హామీలపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్టార్ క్యాంపెయినర్ రమ్య వివాదస్పదంగా ట్వీట్ చేశారు. బీజేపీ ర్యాలీలో మోడీ మద్యం మత్తులో మాట్లాడి వెళ్లారని కామెంట్ చేసింది.
ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు చివాట్లు పెడుతున్నారు. దేశంలో అత్యున్నత స్థానం ఉన్న మోడీ గురించి ఇలా మాట్లాడడం సరికాదని కన్నడ హీరో జగ్గేష్ సూచించారు.ఇంతకీ రమ్య ఎవరు..? ఆమెకు కన్నడ మాట్లాడడమే రాదు. అలాంటిది మోడీ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అక్షింతలు చల్లారు. కర్నాటక బీజేపీ మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు శిల్ప గణేష్ మాట్లాడుతూ రమ్య పేరులో రమ్ ఉంది . అందుకే రమ్య రమ్ తాగి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తుందని సూచించారు. మోడీని కించపరిస్తే తగిన బుద్ది చెబుతామని శిల్పా గణేష్ హెచ్చరించారు. ఈమె చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. తన స్నేహితురాలికి సపోర్ట్ చేస్తారో లేక మద్దతు పలుకుతారో..?