రాజకీయాల పుణ్యమా అని ఎవరేం చేసినా.. దానికి సరికొత్త భాష్యం చెప్పటం ఇప్పుడో పద్ధతిగా మారింది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించటం రాజకీయ రంగును పులుముకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ కు షారూక్ యజమాని అన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన షేర్లను మారిషస్ కు చెందిన జైమెహతా కంపెనీకి అమ్మిన విషయంలో ఫెమా రూల్స్ ను అతిక్రమించారన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో భాగంగా జట్టు యజమాని అయిన షారూక్ ను ఈడీ.. దీపావళి పండుగ రోజున పిలిపించి ప్రశ్నలు వేసింది.
తాజాగా ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ మధ్యన దేశంలో పెరిగిపోతున్న మత అసహనం మీద షారూక్ మాట్లాడినందుకే.. మోడీ సర్కారు ప్రతీకారంతో ఇలాంటి పని చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈడీ విచారణ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. ఫెమా రూల్స్ ను ఉల్లంఘించారని షారూక్ ను ప్రశ్నించారా? లేక.. టార్గెట్ చేశారా? ప్రభుత్వ ప్రతీకార చర్యలకు ఈడీ సరికొత్త ఆయుధంగా మారిందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు.
ఆరోపణలు చేయటంలో తప్పు లేదు. కానీ.. విచారణ సంస్థల విధి నిర్వహణ మీద ప్రభావం చూపించేలా వ్యాఖ్యలు చేయటమే అసలు అభ్యంతరం. ఒకవేళ షారూక్ కానీ ఎలాంటి తప్పులు చేయకున్నా.. కేవలం వేధించటం కోసమే ఈడీ ప్రశ్నలు వేస్తుందన్న సమాచారం పక్కాగా చేతిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేయటంలో తప్పు లేదు. కానీ.. సంబంధం లేని అంశాల్ని కలగలిపి.. ఇలాంటి ఆరోపణలు చేయటం ద్వారా.. అనవసరమైన గందరగోళం చోటు చేసుకోవటం ఖాయం. ఎవరు తప్పు చేసినా.. ఏదో ఒక రాజకీయ పార్టీ రంగంలోకి దిగి.. ఇదంతా రాజకీయ కుట్ర అంటే.. తప్పు చేసినోళ్లు ఈజీగా తప్పించుకునే ప్రమాదం ఉందన్న విషయం మర్చిపోకూడదు. ఒకవేళ విచారణ సంస్థలు అత్యుత్సాహంతో పని చేస్తే ఆ విషయాన్ని విమర్శించటంలో తప్పు లేదు. కానీ.. ఆ పేరుతో ప్రభుత్వాన్ని లాగటం అంత మంచి పరిణామం కాదన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.