మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ..కలహాల కాపురం అన్నట్లుగా సాగుతున్న బీజేపీ-టీడీపీల బంధంపై జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విభజన హామీలు నిలుపుకోలేకపోవడం, బడ్జెట్ లో మొండిచేయి వంటి అంశాలపై టీడీపీ నిలదీయకపోవడంతో ఏపీలోని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీతో తెగదెంపుల సిగ్నల్స్‌ను టీడీపీ ఇస్తోంది. అయితే ఆ వెంటనే సర్దుకునే ప్రయత్నం చేస్తోంది. కాగా, ఈ పరిణామాలను జాతీయ నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బీజేపీకి టీడీపీ రాంరాం చెప్పడం ఖాయమని అంటున్నారు.
కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తాజాగా ఇదే జోస్యం చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్టు బీజేపీ మిత్రపక్షంగా కొద్దికాలం క్రితం వరకు కొనసాగిన శివసేన పార్టీ ఇటీవల తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ నేతలకు మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సుర్జేవాల స్పందిస్తూ ఎన్‌డీఏ మిత్రపక్షాల్లో శివసేన ఇప్పటికీ కూటమి నుంచి బయటకు వచ్చేసిందని, టీడీపీ కూడా అదే దారిలో ఉన్నదని తెలిపారు. ఈ క్రమంలో విపక్షాలు ఏకమైతే 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నట్టు వివరించారు.
ఢిల్లీలో సుర్జేవాల మీడియతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే అని, ఆయనను ప్రధానిగా చూడాలని దేశం కోరుకుంటున్నదని తెలిపారు. దేశంలో నేడు మోడీ మోడల్, కాంగ్రెస్ మోడల్ ఉన్నాయన్నారు. మోడీకి జనం సమస్యలను పరిష్కరించడం కంటే సూటు బూటుపైనే ఎక్కువ మక్కువని సుర్జేవాలా మండిపడ్డారు. మోడీ రోజుకు ఆరుసార్లు దుస్తులు మారుస్తారని ఆరోపించారు. రాష్ట్రాల వ్యవహారాల కంటే ఆయన వస్త్రధారణ(సూటు బూటు)పైనే ఎక్కువ శ్రద్ధ పెడుతారని విమర్శించారు.
అదే రాహుల్ గాంధీ నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారని తెలిపారు. కర్నాటకలో మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకొస్తుందని సూర్జేవాలా ఆశాభావం వ్యక్తం చేశారు. రాజస్థాన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ట్రైలర్ మాత్రమేనన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ - చత్తీస్ గఢ్ సహా ఇతర రాష్రాల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.