ఈ దేశాన్ని ఎంతకూ వదలి వెళ్లని రెండు అంశాలు ఎవన్నది చూస్తే.. ఒక బోఫోర్సు.. రెండోది రామ జన్మభూమి. ఈ రెండు అంశాలతో ఇప్పటికే ఎన్నో ఎన్నికలు.. మరెన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి. అయినా.. ఈ రెండింటిని ఉద్దేశించి రాజకీయం చేయటం.. రాజకీయ లబ్థి పొందటం కామన్ గా మారిపోయింది.
ఈ రెండు అంశాలతో ఏ ఒక్కదానితో లబ్థి పొందిన ఏ పార్టీ కూడా.. ఈ ఇష్యూ లెక్క తేల్చింది లేదు. ఎప్పటికప్పుడు ఈ రెండు ఇష్యూలను నానుస్తూ.. రాజకీయ లబ్థి పొందేందుకు అవసరమైన సెంటిమెంట్ ను రగిలుస్తూ ఉంటారు.మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన నేపథ్యంలో తాజాగా బీజేపీ పరివారం రామజన్మభూమి అంశాన్ని తెర మీదకు తెచ్చింది.
రామజన్మభూమి అంశాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదన్న మాటను చెప్పటంతో పాటు.. ఈ అంశాన్ని ఎంతలా కెలకాలో అంతలా కెలికి భావోద్వేగాలతో రాజకీయ లబ్థి పొందాలన్నట్లుగా బీజేపీ ప్లాన్ అన్నట్లు ఉంది. ఒకవేళ అలాంటిదేమీ లేదంటే.. ఈ ఇష్యూకు ఒక సామరస్య రాజీని కుదర్చటం ద్వారా ముగింపు పలకొచ్చు. కానీ.. అలాంటిదేమీ లేకుండా అదే పనిగా సాగదీస్తున్న తీరు చూసినప్పుడు.. రామజన్మభూమితో ఇప్పటివరకూ సాగిన రాజకీయం ఇంకా సాగాలన్నట్లుగా ఉందన్న విషయం అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే.. రామజన్మభూమి వ్యవహారంపై బీజేపీ నేతలు అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేత రాన్ దీప్ సుర్జేవాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. బీజేపీ.. ఆర్ ఎస్ ఎస్ రెండూ కలియుగ కైకేయిలుగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల ముందు వారికి రామజన్మభూమి అంశం గుర్తుకు వస్తుందన్నారు.
సత్య యుగంలో కైకేయి కేవలం 14 ఏళ్లు మాత్రమే రామున్ని రాజ్య బహిష్కరణ చేసిందని.. కానీ కలియుగ కైకేయిలు అయిన బీజేపీ..సంఘ్ లు మాత్రం 30 ఏళ్లుగా రాముడ్ని బహిష్కరించారన్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు మాత్రమే వారికి రాముడు గుర్తుకు వస్తారని.. ఎన్నికలు అయిపోయిన వెంటనే రాముడ్ని వదిలేస్తారన్న ఆయన.. బీజేపీ.. సంఘ్ పరివార్ లు వానాకాలంలో అరిచే కప్పలుగా అభివర్ణించారు. వారుఊరికే బెక బెక మంటారే కానీ.. వారి చేతుల్లో ఏమీ ఉండవని చెప్పారు. చాలా కాలం తర్వాత బీజేపీ వైఫ్యలాన్ని సునిశిత విమర్శలతో ఆకట్టుకునేలా కాంగ్రెస్ నేత సర్జేవాలా వ్యవహరించారని చెప్పాలి.