పవన్ కు దిమ్మదిరిగే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే

Update: 2020-01-04 10:00 GMT
జనసేనాని పవన్ కళ్యాణ్ కు గట్టి షాక్ తగిలింది. ఆయన పార్టీ తరుఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. పవన్ కు దిమ్మదిరిగే పంచ్ ఇచ్చారు. పవన్ కు ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు పార్టీలో రెండు అభిప్రాయాలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఆయన సొంత అన్నయ్య చిరంజీవి కూడా మూడు రాజధానులను సమర్థించారని.. పవన్ కూడా మూడు రాజధానులను వ్యతిరేకించడం లేదన్నారు. పార్టీ అధినేతగా పవన్ నిర్ణయం ఆయనదేనని.. తనకు పార్టీ కన్నా ఓట్లేసి గెలిపించిన ప్రజలే ముఖ్యమన్నారు.

రాజధానులతో సామాన్యులకు పని ఉండదని.. మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని.. విభజనతో ఏపీ నష్ట పోయిందని.. అలా జరగకూడదంటే మూడు రాజధానులే నయం అని స్పష్టం చేశారు.

ప్రభుత్వాలకు అనుకూలంగా కమిటీల నివేదికలు ఉంటాయని.. హైపవర్ కమిటీ నిర్ణయం కూడా ఇలాగే ఉంటుందని రాపాక అన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇలా జనసేనాని ఓ పక్క అమరావతి రైతులకు మద్దతు గా ఏపీలో రాజకీయం చేస్తుంటే ఆయన పార్టీ ఎమ్మెల్యే మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికి జై కొట్టడం సంచలనంగా మారింది.
Tags:    

Similar News