ఆ బీజేపీ ఎమ్మెల్యేతో పార్టీ కార్యక్రమాల్లో ఆ మహిళా కార్యకర్త చురుగ్గా పాల్గొంటోంది. అయితే ఎక్కడ జరిగిందో ఏమైందో తెలియదు కానీ ఆ మహిళ తనను ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఇదిప్పుడు కలకలం రేగింది.
ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదైంది. ఎమ్మెల్యే సురేశ్ రాథోడ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఓ మహిళ కార్యకర్త ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు జ్వాలాపూర్ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ పై ఐపీసీ సెక్షన్ 376, 504, 506 సీఆర్ పీసీ యాక్ట్ 156(3)ల కింద కేసు నమోదు చేసినట్టు హరిద్వార్ సీనియర్ పోలీస్ అధికారి అబుదాజ్ కృష్ణరాజ్ చెప్పారు.
ఎమ్మెల్యే పై కేసు నమోదు చేశామని.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని బహదారాబాద్ పోలీస్ స్టేషన్ అధికారి మహేంద్ర పుందిర్ తెలిపారు. మూడు నెలల కిందటే రాథోడ్ అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత మహిళ ఫిర్యాదు తెలిపింది. ఈ విషయం గురించి బయటపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్టు ఆరోపించింది.
ఇదిలా ఉండగా తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ ఖండించారు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు నాపై కుట్ర పన్ని తప్పుడు కేసు పెట్టించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి అసలు వాస్తవాలు బయట పెట్టాలని అప్పీలు చేస్తున్నా అని రాథోడ్ చెప్పారు.
తనపై అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యే సురేశ్ రాథోడ్ పోలీసులను తప్పుదోవ పట్టించారని బాధిత మహిళ ఆరోపించింది.ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి నిజనిజాలను నిగ్గు తేల్చాలని న్యాయస్థానం ఆదేశించింది.
జ్వాలాపూర్ ఎమ్మెల్యే అయిన రాథోడ్ తో బాధిత మహిళ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, ర్యాలీల్లో బాధిత మహిళ తరచూ పాల్గొని ఆయనతో సన్నిహితంగా మెలిగినట్టు తెలుస్తోంది.