హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. అప్పు కోసం వెళ్లిన ఒక జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం జరిగిన ఉదంతం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది.
కలకలం రేపిన ఈ ఉదంతంలోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2లో 22 ఏళ్ల ఒక యువతి నివసిస్తోంది. సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ నటించే ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.
దీంతో.. తనకు అవసరమైన డబ్బుల కోసం తన స్నేహితుల్ని సంప్రదించగా.. బాలు నాయక్ అనే స్నేహితుడు ఆమెకు డబ్బులు ఇస్తానని.. తన ఇంటికి రావాలని చెప్పగా.. నమ్మిన ఆమె అతడి ఇంటికి వెళ్లింది.
ఆమెను ఇంట్లోకి ఆహ్వానించిన అతడు.. ఆమెను ఒక గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడే ఉన్న తన స్నేహితుడితో కూడా గడపాలంటూ ఒత్తిడి చేసి.. అతడితో గడిపితే రూ.5వేలు ఇస్తానని చెప్పాడు.
అతడి నుంచి తప్పించుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆమె.. తన బంధువుకు ఫోన్ చేసింది. దీంతో.. వీరిద్దరు కలిసి మళ్లీ అతగాడి ఇంటికి వెళ్లి నిలదీయాలని భావించారు. ఇద్దరు అతగాడి ఇంటికి వెళ్లేసరికి.. తాళం వేసి పరారయ్యాడు.
దీంతో తనకు జరిగిన అన్యాయంపై సదరు మహిళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని వారు బాధితురాలికి హామీ ఇచ్చారు.