రూ.10 ఆశచూపి 13 ఏళ్ల బాలికపై 76 ఏళ్ల వృద్ధుడు, మరొకరు రేప్.. అరెస్ట్

Update: 2022-08-02 12:30 GMT
ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబజార్ జిల్లాలో ఇటీవల 13 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణం ఏంటంటే.. ఈ అత్యాచారం చేసిన వారిలో కాటికి కాలుచాపిన 76 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడని తేలింది. వారు ఆ బాలికపై అత్యాచారం చేసేటప్పుడల్లా  ఆమెకు ₹10 ఎర చూపారని పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు.

ప్రాథమిక విచారణలో బాలికపై అత్యాచారం రెండు రోజుల ముందు జరిగిందని తేలింది. శనివారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ పిల్లల తల్లిదండ్రులను అప్రమత్తం చేయడంతో ఈ ఘోరం బయటపడింది..

బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు నిందితులు కుంజ్‌రామ్ వర్మ (76), రమేష్ వర్మ (47)లను జూలై 31న అరెస్టు చేసినట్లు బలోదబజార్ కొత్వాలి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) యదుమణి సిదర్ తెలిపారు. శనివారం బాలికను రేప్ చేసిన అనంతరం ఇద్దరు నిందితుల ఇళ్ల నుంచి బయటకు రావడం చూసి ఇరుగుపొరుగు మహిళ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక నివసించే అదే ప్రాంతంలో ఉంటున్న కుంజ్రామ్ ప్రతిసారీ ఆమెకు ₹10 ఇస్తానని హామీ ఇచ్చి తన ఇంటికి పిలిచి అత్యాచారం చేసేవాడు. కుంజ్రామ్‌కు తెలిసిన రమేశ్‌ కూడా అంతే డబ్బుతో బాలికపై అత్యాచారం చేయడం ప్రారంభించాడని పోలీసు అధికారి తెలిపారు.

"ఇద్దరు వ్యక్తుల ఇళ్ల నుండి బయటకు వస్తున్న బాలికను గమనించిన పొరుగున ఉన్న ఒక మహిళ ఆమె తన తల్లికి సమాచారం అందించింది. బాలిక తన బాధను వివరించడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేశారు" అని అతను చెప్పాడు.

కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని సిదర్ తెలిపారు. నిందితులపై సామూహిక అత్యాచారం మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో)లోని నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు, తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News