అభంశుభం తెలియని చిన్నారి.. ఏడాదిన్నర వయసున్న పసిపాపపై మృగంగా మారి అత్యాచార నిందితుడిపై బాధితురాలి తండ్రి రగిలిపోయాడు. తన కూతురి పట్ల అంత దారునంగా వ్యవహరించిన నిందితుడి రెండు చేతుల్ని నరికేసిన వైనం పంజాబ్ లో ఇప్పుడు సంచలనంగా మారింది.
పంజాబ్లోని బటిండాలో ఒక దారుణం జరిగింది. ఏడాదిన్నర వయసున్న ఒక చిన్నారిపై 2014లో ఒకవ్యక్తి అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించి కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. తాజాగా బాధిత బాలిక తండ్రి నిందితుడి మీద కత్తితో దాడి చేసి రెండు చేతుల్ని నరికేశాడు. దీంతో తీవ్ర గాయాలైన నిందితుడ్ని ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేస్తున్నారు. తండ్రి చేసిన పనిని పలువురు సమర్థిస్తున్నారు.
అయితే.. పసిపాపపై అత్యాచారం చేసిన నిందితుడికి శిక్ష విధించటంలో కోర్టులు రెండేళ్లు సమయం తీసుకోవటం ఏమిటి? దారుణమైన నేరాలకు శిక్ష విధించే విషయంలో న్యాయస్థానాల్లో జరిగే ఆలస్యమే ఇలాంటి ప్రతీకారాలకు అవకాశం ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.