రాఫేల్‌ యుద్ధ విమానాల సంస్థ ఓనర్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి !

Update: 2021-03-08 07:30 GMT
యుద్ధ విమానాలకు ఫేమస్ డస్సాల్ట్ కంపెనీ ఓనర్ ఒలివియర్ డస్సాల్ట్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఫ్రాన్స్ ‌లో అత్యంత సంపన్నులలో ఒకరైన ఒలివియర్ కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ గా కూడా ఉన్నారు. వాయవ్య ఫ్రాన్స్‌ లోని నార్మండి ప్రాంతంలో ఆ దేశ టైమ్ ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు హెలికాప్టర్‌ కుప్పకూలిందని తెలిసింది. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్‌ లో పైలెట్‌ తో పాటు ఒలివియర్‌ మాత్రమే ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఒలివియర్‌తోపాటూ పైలెట్‌ కూడా చనిపోయాడు. ఒలివియర్‌ మృతిపై ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మాక్రాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఆయన మృతి తీరని లోటు అన్నారు. ఒలివియర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒలివియర్‌ తాత మార్సెల్‌ డస్సాల్ట్‌ ప్రపంచంలోనే ఫేమస్ అయిన డస్సాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీని స్థాపించారు. భారత్ ‌కు రాఫేల్‌ యుద్ధ విమానాల్ని ఈ సంస్థే తయారు చేసి ఇచ్చింది. ఫ్రెంచి బిలియనీర్ అయిన సెర్జి డస్సాల్ట్ పేరుమీద డస్సాల్ట్ ఏవియేషన్ పుట్టుకొచ్చింది. ఈ కంపెనీకి లి ఫిగారో న్యూస్ పేపర్ కూడా ఉంది. ఒలివెర్ డస్సాల్ట్ ‌కి ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన స్థానిక ఎయిర్ ఫోర్స్‌ లో రిజర్వ్ కమాండర్ కూడా. తన జీవితంలో ఆయన ఎప్పుడూ విలువలకు కట్టుబడి ఉన్నారని, అధ్యక్షుడు మాక్రాన్ ట్విట్టర్‌లో తెలిపారు. ఫోర్బ్స్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలోని బిలీనియర్ల జాబితాలో 361వ స్థానంలో ఒలీవర్ ఉన్నారు. ఈయన సంపద 6.3 బిలియన్ యూరోలు. ఒలీవర్ డస్సాల్ట్‌కు ముగ్గురు పిల్లలు.
Tags:    

Similar News