లైంగికంగా వేధిస్తే మ‌ర‌ణ‌దండ‌నేన‌న్న సీఎం

Update: 2017-10-07 07:42 GMT
మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. చిన్నారుల‌పై లైంగిక హింస‌కు పాల్ప‌డేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు ప‌క్కా అని చెప్ప‌ట‌మే కాదు.. అలాంటి దుర్మార్గుల‌కు మ‌ర‌ణ‌దండ‌న ఖాయ‌మ‌ని తేల్చి చెప్పిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారుల‌పై లైంగిక వేధింపుల‌కు గురి చేసే దుర్మార్గుల‌కు మ‌ర‌ణ‌దండ‌న త‌ప్ప‌నిస‌రి అంటూ మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ చౌహాన్ వెల్ల‌డించారు. అభంశుభం తెలీని చిన్నారుల‌పై అత్యాచారం చేసే మృగాళ్ల‌కు మ‌ర‌ణ‌దండ‌న విధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

బాలిక‌ల్ని లైంగికంగా వేధించిన కామాంధుల‌కు మ‌ర‌ణ‌దండ‌న విధించేలా రాష్ట్రం నిర్ణ‌యం తీసుకోనుంద‌ని.. అందులో భాగంగా త్వ‌ర‌లోనే అసెంబ్లీలో బిల్లును ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్లుగా పేర్కొంది. సుర‌క్షిత బాల్యం.. సుర‌క్షిత ఇండియా నినాదంతో దేశ వ్యాప్తంగా నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత కైలాస్ స‌త్యార్థి నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ముఖ్య‌మంత్రి శివరాజ్‌.. మ‌ర‌ణ‌దండ‌న విధించేలా చ‌ట్టం తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మ‌రి.. ముఖ్య‌మంత్రి చెప్పిన మాట‌.. చట్ట‌రూపంలో ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.
Tags:    

Similar News