రేపిస్టులను ఉరితీయకూడదు.. జీవితాంతం జైల్లోనే ఉంచాలి: కోర్టు సంచలన తీర్పు
అత్యాచార ఘటనలు జరిగినప్పుడు దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఖండిస్తారు. వారిని ఉరితీయాలని బాధితులు , మహిళా సంఘాలు డిమాండ్ చేస్తాయి. కానీ అత్యాచార ఘటనల్లో దోషులుగా తేలిన వారికి మాత్రం ఉరితీయకుండా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వారిని జీవితాంతం జైల్లోనే ఉంచాలని స్పష్టం చేసింది. ఉరిశిక్ష వేస్తే వెంటనే మరణిస్తారని.. పశ్చాత్తాపం చెందేందుకు అవకాశం ఉండదని తెలిపింది.
అదే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే తాను చేసిన తప్పును తెలుసుకొని ఉక్కిరిబిక్కిరి అవుతాడని పేర్కొంది. జీవితాంతం జైల్లోనే కుమిలికుమిలి చావాలని.. రేపిస్ట్ లకు ఇలాంటి శిక్షలు విధిస్తేనే బాగుంటుందని స్పష్టం చేసింది.
చత్తీస్ ఘడ్ లోని గత ఏడాది ఏడేళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.అనంతరం దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
చత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లాకు భిలాయ్ ప్రాంతంలో గత ఏడాది జనవరి 30న ఓ మైనర్ బాలికపై రేప్ జరిగింది. ఏడేళ్ల బాలికపై రజత్ భట్టాచార్య అనే 22 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. అంతేకాదు ఆమె ప్రైవేట్ పార్ట్స్ ను తీవ్రంగా గాయపరిచాడు. బాలికకు తల్లిలేదు. తండ్రి ఉదయం 10 గంటలకు ఉద్యోగానికి వెళితే మళ్లీ రాత్రి 9 గంటలకు ఇంటికి వస్తాడు. అతడు లేని సమయంలో రజత్ ఆ బాలిక ఇంట్లోకి వెళతాడు. రాత్రి 7 గంటల సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి చెల్లి కూడా ఉంది. పిల్లలు ఏడుస్తున్నా వదిలిపెట్టలేదు. పశువుల ప్రవర్తించి తన కామవాంఛను తీర్చుకున్నాడు.
రాత్రి 9 గంటలకు ఇంటికొచ్చిన తండ్రి.. తన కూతురి పరిస్థితిని భోరుమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఏడాదికి పైగా విచారణ జరిగింది. ఈ కేసులో దుర్గ్ జిల్లాలోని ప్రత్యేక కోర్టు మార్చి 23, 2022న తీర్పు వెలువరించింది. నిందితుడికి జరిమానాతో పాటు జీవిత ఖైదు కూడా విధించింది. బాధితురాలికి రూ.6.50 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తీర్పు సందర్భంగా దుర్గ్ స్పెషల్ కోర్టులోని అదనపు సెషన్స్ జడ్జి అవినాష్ కే త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిందితుడికి మరణశిక్ష విధిస్తే అతడు తన దుశ్చర్యలకు ప్రాయశ్చిత్తం చేసుకోలేడని.. జీవితాంతం జైలు శిక్ష పడితే తాను ఎంత పెద్ద తప్పు చేశాడో తనకు అర్థమవుతుందని కోర్టు తీర్పునిచ్చింది. చచ్చేవరకూ పశ్చాత్తాపం చెందుతాడని.. కుమిలి చస్తాడని పేర్కొంది. రేపిస్టులకు మరణశిక్ష విధించకూడదన్నది నా అభిప్రాయం అని తెలిపారు.