అవకాశాల కోసం వచ్చే వారికి ఛాన్సులు ఇస్తామంటూ ముగ్గులోకి లాగే సన్నాసులు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో మస్తుగా ఉన్నారు. ఇప్పటికే ఆ వుడ్డు.. ఈ వుడ్డు అన్న తేడా లేకుండా తమకు ఎదురైన దుర్మార్గాల్ని వరుస పెట్టి మరీ చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికే చెప్పుకొచ్చిన వైనం తెలిసిందే. తాజాగా సంచలన వ్యాఖ్యల్ని వెల్లడించింది ప్రముఖ సింగర్ కమ్ సాంగ్ రైటర్ కార్డి బి.
గ్రామీ అవార్డు విన్నర్ అయిన ఆమె తాజాగా తన విషయంలో ఒక ఫోటోగ్రాఫర్ వ్యవహరించిన ఛండాలం గురించి చెప్పుకొచ్చింది. టీవీ కమ్ రేడియో హోస్ట్ ఏంజీ మార్టినెజ్ తో చిట్ చాట్ సందర్భంగా సంచలన అంశాల్ని వెల్లడించింది. తానో ఫోటో షూట్ లో పాల్గొన్నప్పుడు తన విషయంలో ఒక ఫోటో గ్రాఫర్ దారుణంగా ప్రవర్తించాడని చెప్పింది.
అతని ప్రవర్తనతో తనకు మండిపోయిందని చెప్పింది. తానో ప్రముఖ మ్యాగజైన్ ఫోటో షూట్ కు వెళ్లానని.. అక్కడకు వెళ్లిన తర్వాత ఒక ఫోటో గ్రాఫర్ వచ్చాడని.. ఈ మ్యాగ జైన్ లో నువ్వు రావాలా? అని అడుగుతూ చాలా దగ్గరగా వచ్చాడని చెప్పింది. అతడి తీరుతో తనకు ఒళ్లు మండిందని పేర్కొంది. తాను సమాధానం ఇచ్చే సమయంలోనే అతడు మరింత దగ్గరగా వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని.. దీంతో తనకు కోపం వచ్చి మ్యాగజైన్ యజమానికి వద్దకు వెళ్లి.. ఫోటోగ్రాఫర్ చేసిన ఎదవ పని గురించి చెప్పానని చెప్పారు.
అయితే.. తన కంప్లైంట్ కు సదరు మేగజైన్ యజమాని తన వంక తేరిపార చూశాడే తప్పించి.. స్పందించలేదన్నారు. ఇన్ని చెప్పిన కార్డి బి.. తన పట్ల అంత దుర్మార్గంగా వ్యవహరించిన ఫోటో గ్రాఫర్.. అతడికి దన్నుగా నిలిచిన మ్యాగజైన్ పేరును వెల్లడిస్తే దరిద్రం వదిలేది. అలా చేయకుండా విషయం చెప్పి.. వేధింపుల గురించి సమాచారం ఇస్తే ఏం సరిపోతుంది చెప్పు కార్డి?