ఎంచక్కా భార్యతో ‘శృంగారం’ చేసిన తర్వాత.. ఆ గురుతులతో ఎంజాయ్ చేయటం చాలామంది చేసేదే. అందుకు భిన్నంగా ఒక వ్యక్తి విచిత్రమైన ఇబ్బందికి గురి అవుతున్నాడు. భార్యతో శృంగారం చేసి పది నిమిషాలకే అన్ని మర్చిపోవటం.. తాను సెక్సు చేసిన వైనాన్ని కూడా గుర్తు పెట్టుకోలేని విచిత్రమైన పరిస్థితి ఒకటి ఎదురవుతోంది. అత్యంత అరుదుగా ఉండే ఈ కేసు స్టడీని తాజాగా ఐరిష్ మెడికల్ జర్నల్ పేర్కొనటంతో ఈ ఉదంతం ప్రపంచానికి తెలిసింది.
ఐర్లాండ్ కు చెందిన ఒక వ్యక్తి భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకే.. ఆ విషయాలన్నీ మర్చిపోతున్నాడు. అంతేకాదు.. తనకు అంతకు ముందు రోజుకు సంబంధించిన విషయాలు కూడా గుర్తుండటం లేకపోవటంతో ఆందోళన చెందాడు. దీనికి సంబంధించి కేసును చూస్తే.. 66 ఏళ్ల వ్యక్తి తన భార్యతో శృంగారం చేశాడు. పది నిమిషాల తర్వాత తాను సెక్సు చేసిన విషయాన్ని మర్చిపోయాడు. అంతేకాదు.. వాచ్ లో డేట్ చూసి కంగుతిన్నాడు. ఎందుకంటే.. ముందు రోజు తమ పెళ్లి రోజు అన్న విషయం అతనికి అప్పుడే గుర్తుకు రావటమే దీనికి కారణం.
తన వేదనను భార్య ముందు తీసుకొచ్చాడు. దీంతో ఆవిడ కంగారు పడింది. ఎందుకంటే.. అంతకు ముందు రోజే.. తమ పెళ్లి రోజు వేడుకల్ని ఎంచక్కా చేసుకోవటంతో పాటు.. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసింది. అదే విషయాన్ని అతనికి ఆమె చెప్పింది. అయితే.. తనకు మాత్రం అలాంటివేమీ గుర్తు లేవని చెప్పటంతో పాటు.. ‘నిన్నసాయంత్రం నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో చెప్పు?’ అంటూ అడిగిన వైనంతో ఇంట్లోని వారు సైతం అదిరిపడ్డారు.
విచిత్రమైన విషయం ఏమంటే.. ఈ హటాత్తు మతిమరుపు అన్ని విషయాల్లో కాకుండా.. కేవలం ముందు రోజు విషయంలోనే ఉండటం వారికి అర్థం కాలేదు. పాత విషయాల్నిప్రస్తావిస్తే.. అన్నింటికి సమాధానం చెప్పటంతో ఏం చేయాలో పాలుపోక ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అయితే.. అంతా మామూలుగా ఉందని తేల్చారు. మరి.. ఈ తాత్కాలిక మతిమరుపు ఏమిటి? అన్నది అర్థం కాక అయోమయానికి గురయ్యారు. అయితే.. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత ముందు రోజు జ్ఞాపకాలన్నీ గుర్తుకు రావటంతో ఊపిరి పీల్చుకున్నారు.
దాదాపుగా ఏడేళ్ల క్రితం కూడా ఇలానే ఇతను వ్యవహరించినట్లు చెబుతున్నారు. అప్పట్లో కూడా భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకు ఆ విషయాన్ని మర్చిపోయారట. మళ్లీ ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శించటంతో వైద్యులు అతని కేస్ ను జాగ్రత్తగా స్టడీ చేశారు. ఈ అరుదైన కేసు గురించి ఐరిష్ మెడికల్ జర్నల్ లో ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ప్రచురించారు.
సాధారణంగా స్ట్రోక్ కారణంగా నరాల బలహీనత ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా గా పేర్కొనే షార్ట్ టర్మ మెమరీ లాస్ కారణమవుతుందని.. అలాంటివేమీ లేకుండా కొందరిలో అరుదుగా ఈ సమస్య తలెత్తుతుందని.. అలాంటిదే ప్రస్తుత కేసుగా చెబుతున్నారు. 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఇలా జరగటానికి వీలుందని చెబుతున్నారు.
అయితే.. ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చోటు చేసుకుంటాయన్న విషయానికి వస్తే.. శారీరకంగా బాగా శ్రమ పడినా.. అతి చల్లని లేదంటే బాగా వేడి నీళ్లల్లో చాలాసేపు మునిగినా.. భావోద్వేగ ఒత్తికి గురైనా.. అరుదుగా కొన్నిసార్లు సెక్సు చేసినా కూడా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. మనోడికి.. సెక్సు చేసిన తర్వాత ఇలా జరగటం గమనార్హం. అయితే.. ఈ విచిత్రమైన ఉదంతంలోనూ.. కొన్ని గంటల తర్వాత అన్ని గుర్తుకు రావటం కొంతలో కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు.