హుబ్లీ లో అరుదైన ఘటన ..ఒకే కాన్పు లో

Update: 2019-11-11 07:24 GMT
సాధారణం గా ఒక  ఒక కాన్పు లో ఒకరు పుడతారు. ఆలా కాకుండా కవలలు జన్మించడం చాలా అరుదు గా జరుగుతుంటుంది. ఇక ఒకే కాన్పు లో ముగ్గురు జన్మించడం అనేది అదొక వింత , విశేషం గా చెప్పుకుంటారు. కానీ , తాజాగా కర్ణాటక లోని హుబ్లీ లో ఒకే కాన్పు లో ఒక మహిళా నలుగురి కి జన్మనిచ్చింది. కలిసొచ్చే కాలాని కి నడిసొచ్చే కొడుకు అంటే ఇదేనేమో ..ఒక్కొక్కరి ని ఒక్కో సారి పెంచాల్సిన అవసరం లేకుండా ఒకే సారి అందరిని పెంచి పెద్ద చేయచ్చు. కానీ ఒకే కాన్పు లో ఏకంగా నలుగురు పుట్టడం తో స్థానికం గా ఇది సంచలనమైంది.

హావేరి జిల్లా లోని సవణూరు గ్రామాని కి చెందిన మహబూబ్‌ బీ అనే గర్భిణి నెలలు నిండడం తో ప్రసవం కోసం హుబ్లీ లోని ప్రభుత్వ కిమ్స్‌ ఆస్పత్రి లో చేరారు. ఆదివారం నొప్పులు రావడం తో వైద్యులు సిజేరియన్‌ కాన్పు చేశారు. అయితే ఆపరేషన్‌ చేసిన వైద్యులు ఒక్కో బిడ్డను బయటకు తీస్తూ ఆశ్చర్య పోయారు. మొత్తం నలుగురు బిడ్డలు ఉండడం, ఒక్కో బిడ్డ రెండు కేజీల బరువుండడంతో అమితాశ్చర్యానికి లోనయ్యారు. ఇది కొంత విశేషమేనని, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. ఆ నలుగురిలో  ముగ్గురు మగ బిడ్డలు, ఆడపిల్ల జన్మించారు. ఆమెకి ఇది రెండో కాన్పు. మహబూబ్‌ బీకి తొలి కాన్పులో ఒక మగపిల్లాడు జన్మించాడు.
Tags:    

Similar News