నిజమే... ఈ ఫొటో అత్యంత అరుదనే చెప్పాలి. అత్యంత అరుదే కాదండోయ్... సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వగానే... ఈ ఫొటో తెగ వైరల్ గా మారిపోయింది. ఈ సీఎంకు ఆ ‘సీఎం‘ స్వాగతం చెప్పడమేంటీ? ఆ ‘సీఎం’ స్వాగతం చెప్పగానే... ఈ సీఎం ‘ఏమన్నా ఎలా ఉన్నారు... బాగుండారా?’ అంటూ ఆత్మీయంగా పలకరించడమేంటీ?. ఆ వెంటనే వెంట తెచ్చుకున్న పుష్ప గుచ్చాన్ని ఈ సీఎంకు ఆ ‘సీఎం’ అందించడమేంటి?... నిజమే... ఈ సందర్భంగా వంద ప్రశ్నలను రేకెత్తించిందనే చెప్పాలి. ఇందులో ఈ సీఎం... ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాగా... ఆ ‘సీఎం’ మొన్నటిదాకా టీడీపీలో కొనసాగి, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడిగా కొనసాగి, ఇటీవలే బీజేపీలో చేరిపోయిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్.
వ్యక్తులు సరే... వీరిద్దరూ కలవడం, ఆప్యాయంగా పలకరించుకోవడం, జగన్ ను సీఎం రమేశ్ ఘనంగా సత్కరించడం, ఆత్మీయ స్వాగతం పలకడం, జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడికక్కడే కొనియాడటం, గతంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కీర్తించడం... నిజంగానే ఆసక్తి రేకెత్తించింది. ఇక అసలు విషయానికి వెళితే... కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసేందుకు సీఎం హోదాలో జగన్ జమ్మలమడుగు ప్రాంతానికి సోమవారం వెళ్లగా... జగన్ కు స్వాగతం పలికేందుకు బారులు తీరిన వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధుల వెంట సీఎం రమేశ్ ఉంటడం ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసే ప్రాంతానికి జగన్ చేరుకోగానే... ఆయనకు ఎదురెళ్లిన సీఎం రమేశ్... జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ‘ఎలా ఉన్నారన్నా.... అంతా బాగుండారా?’ అంటూ జగన్ కూడా సీఎం రమేశ్ ను ఆత్మీయంగా పలకరించారు.
కుశల ప్రశ్నలు అయిపోగానే... తన వెంట తీసుకొచ్చిన పుష్ప గుచ్ఛాన్ని జగన్ చేతిలో పెట్టిన సీఎం రమేశ్... శాలువాను జగన్ కు కప్పారు. అనంతరం స్టీల్ ప్లాంట్ కోసం తాను చేపట్టిన పోరాటాన్ని సీఎం రమేశ్... జగన్ కు గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా... గత ప్రభుత్వం కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా ఏమీ చేయలేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ప్రజల కలను సాకారం చేసే దిశగా సాగుతున్న జగన్ ను ఆయన అభినందించారు. అంతేకాకుండా పరోక్షంగా చంద్రబాబు సర్కారుపై విమర్శలు గుప్పించారు. మొత్తంగా జగన్ కు ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం రమేశ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. నిన్నటిదాకా జగన్ అంటేనే ఒంటికాలిపై లేచే సీఎం రమేశ్... అందిరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఇలా జగన్ కు ఆత్మీయ స్వాగతం పలకడం నిజంగానే వైరల్ గా మారిపోయిందని చెప్పాలి. అంతేకాకుండా... జగన్, సీఎం రమేశ్ ల మధ్య భవిష్యత్తు సంబంధాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నలనూ రేకెత్తించింది.