స్వీట్ ఫైట్ లో ఆ రాష్ట్రమే విజేత‌గా నిలిచింది

Update: 2017-11-15 07:32 GMT
మిఠాయి ప్రియుల‌కు అత్యంత ఇష్ట‌మైన మిఠాయి ర‌స‌గుల్లా. పేరు విన్నంత‌నే నోట్లో నీళ్లూర‌టం కామ‌న్‌. అయితే.. ఈ ర‌స‌గుల్లా మాదంటే.. మాదంటూ పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది. ఈ మిఠాయి పుట్టింది త‌మ ద‌గ్గ‌రే అంటూ అటు ప‌శ్చిమ బెంగాల్‌.. ఇటు ఒడిశాలు పోటీ ప‌డ్డాయి. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫిక‌ల్ ఇండికేష‌న్‌) కోసం రెండు రాష్ట్రాల మ‌ధ్య‌న హోరాహోరీ యుద్ధమే జ‌రిగింది.

చివ‌ర‌కు ఈ యుద్ధంలో ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రం విజేత‌గా నిలిచింది. ర‌స‌గుల్లా బెంగాల్ దేన‌ని.. అక్క‌డే ఆ మిఠాయి పుట్టింద‌ని జియోగ్రాఫిక‌ల్ ఇండికేష‌న్ రిజిస్ట్రీ ఫైన‌ల్ చేసింది. ర‌స‌గుల్లా త‌మ‌దేన‌ని  తేల‌టంతో ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ హ‌ర్షం వ్య‌క్తం చేయ‌టంతో పాటు చాలా సంతోషంగా.. గ‌ర్వంగా ఉన్న‌ట్లు దీదీ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ర‌స‌గుల్లా పోరులో ఓడిన ఒడిశా మాత్రం ర‌స‌గుల్లా జీఐ త‌మ‌కు వ‌స్తుంద‌ని.. తామింకా ద‌ర‌ఖాస్తు చేయ‌లేద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి శ‌శిభూష‌ణ్ పేర్కొన్నారు. 

ర‌స‌గుల్లాపై ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌టానికి తాము త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెబుతున్నారు. ఓవైపు ర‌స‌గుల్లా త‌మ సొంత‌మైందంటూ బెంగాల్ స‌ర్కారు సంబ‌రాలు చేసుకుంటుంటే.. మ‌రోవైపు ఒడిశా ప్ర‌భుత్వం మాత్రం..

జియోగ్రాఫిక‌ల్ ఇండికేష‌న్ కోసం త్వ‌ర‌లోనే  ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని పేర్కొన‌టం  గ‌మ‌నార్హం. అంటే.. స్వీట్ వార్ ఇంకా పూర్తి కాలేదా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News