ఎన్నో మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయంలో అనూహ్యంగా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సీఎం అయ్యారు. అయితే ఆయనకు సూతారం అధికారం అందలమెక్కడం ఇష్టంలేదు. బీజేపీకి మద్దతుగానే అణిగిమణిగి ఉందామని అనుకున్నాడట.. కానీ ఈ శివసేన పెద్దపులిని తట్టిలేపి.. ఎంకరేజ్ చేసి అధికారానికి దగ్గరి చేసింది ఒక ఆడ పులినే. అవును ఉద్దవ్ ఠాక్రే సీఎం కావడంలో కీలక పాత్ర పోషించింది ఆయన భార్య రశ్మి ఠాక్రే.
ఉద్దవ్ ప్రతీ అడుగు - విజయం వెనుక ఆయన భార్య రశ్మీ ఉంది. ఆమె ఆలోచనల ప్రకారమే ఉద్దవ్ బీజేపీకి దూరమై.. ఎన్సీపీ - కాంగ్రెస్ లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు పరోక్ష రాజకీయాలకే పరిమితమైన శివసేనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది రశ్మీ ఠాక్రే. తన కొడుకు ఆదిత్య ఠాక్రేను పోటీ చేయించింది ఈమెనే. అస్సలు పదవులు అనుభవించిన శివసేన అధినేతలను ఏకంగా సీఎం సీటును ఎక్కించింది ఈమేనే.
శివసేన వ్యవస్థాకులు ఠాక్రే - ఆయన కుమారుడు ఉద్దవ్ లు పదవులు అనుభవించేవారు కాదు. వీరి శివసేనలో ఈ సిద్ధాంతం పాటించేవారు. కానీ రశ్మీ మాత్రం ఇప్పుడా సిద్ధాంతాన్ని పక్కనపెట్టి భర్తను మహారాష్ట్ర సీఎం చేయడంలో కీరోల్ పోషించింది. పార్టీలో కూడా క్రియాశీలంగా పనిచేస్తూ మహిళా విభాగాన్ని పటిష్టపరిచారు.
ముంబైలోని డోంబివిలిలో రశ్మీ పటాంకర్ జన్మించింది. జేజే స్కూల్లో చదివేటప్పుడే ఉద్దవ్ ను కలిసింది. ప్రేమలో పడి వీరు పెళ్లి చేసుకున్నారు. బాల్ ఠాక్రే మరణం తర్వాత 40 ఏళ్ల వయసులో ఉద్దవ్ ను రాజకీయాల్లోకి తెచ్చింది రశ్మీనే. రాజకీయాలపై అస్సలు ఆసక్తి లేని ఉద్దవ్ ను సీఎంను చేసిన ఘనత కూడా ఈమెదే. బాల్ ఠాక్రే మరణం తర్వాత రాజ్ ఠాక్రే పగ్గాలకు చేరువైనా ఆయనను పంపించి భర్త ఉద్దవ్ కే పగ్గాలు అప్పగించేలా చేయడంలో రశ్మీ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఉద్దవ్ కుమారుడు ఆదిత్యను రాజకీయాల్లోకి తెచ్చి ఎమ్మెల్యే చేశారు.
ఇక రాజకీయాలే కాదు.. రియల్ ఎస్టేట్ డీలర్స్ రంగంలో కూడా కంపెనీలకు రశ్మీ డైరెక్టర్. పార్ట్ నర్ షిప్ వెంచర్లలో భాగస్వామి.