విమానాన్ని వెన‌క్కి ర‌ప్పించిన మూషికం

Update: 2015-07-31 10:18 GMT
పేరుకు ఎలుకే కానీ.. కొన్ని గంట‌ల పాటు విమాన‌యాన సిబ్బందిని.. ఎయిర్ ట్రాఫిక్ విభాగాన్ని వ‌ణికించేలా చేసింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇంతా చేస్తే స‌ద‌రు ఎలుక విమానంలో ఉందో లేదో కూడా స‌రిగా తెలీని ప‌రిస్థితి. ఒక‌సారి మ‌న‌సులోకి సందేహం వ‌స్తే ఎంత పెద్ద‌దిగా ఉంటుంద‌న‌టానికి తాజా ఉదంత‌మే నిద‌ర్శ‌నం.

అలా అని లైట్ తీసుకుంటే.. 200 మందికి పైగా ప్రాణాలు గాల్లో క‌లిసిపోయే ప‌రిస్థితి. ఇంత‌కీ జ‌రిగిందేమంటే.. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-123 విమానం శుక్ర‌వారం ఉద‌యం న్యూఢిల్లీ ఉంచి మిలాన్‌కు బ‌య‌లుదేరింది. విమానం బ‌య‌లుదేరిన రెండు గంట‌ల‌కు క్యాబిన్ లో ఎలుక ఉంద‌న్న సందేహం క‌లిగింది. అది ఉన్న‌ట్లుగా వారిలో అనుమానం క్ష‌ణ‌క్ష‌ణానికి పెరిగిపోసాగింది. బుజ్జి ఎలుక చిలిపిగా ఏదైనా వైరు కొరికిందంటే.. విమానంలో ఉన్న 200 మందికి పైగా ప్ర‌యాణికులు.. సిబ్బంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోయిన‌ట్లే.

దీంతో విమాన సిబ్బందిలో టెన్ష‌న్ మొద‌లైంది. అలా అని వెంట‌నే విమానాన్ని కింద‌కు దించేయాలంటే.. అప్ప‌టికి విమానం ప్ర‌యాణిస్తోంది పాకిస్థాన్ ఉప‌రిత‌లం మీద‌న‌. స‌ర్లే.. చూద్దామ‌ని రిస్క్ తీసుకోలేని ప‌రిస్థితి. ఎందుకంటే.. మిలాన్ స‌దూరాన ఉండ‌టం.. అప్ప‌టివ‌ర‌కూ వెయిట్ చేయ‌టం ఏ మాత్రం సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు.

అందుకే.. చేసేదేమీ లేక‌.. అంత టెన్ష‌న్ లో విమాన సిబ్బంది విమానాన్ని వెన‌క్కి మ‌ళ్లించే నిర్ణ‌యం తీసుకున్నారు. అలా.. ఎలుక ఉంద‌న్న అనుమానం.. విమానాన్ని వెన‌క్కి మ‌ళ్లేలా చేసింది. ప్ర‌స్తుతం న్యూఢిల్లీలో ల్యాండ్ అయిన విమానంలో ఎలుక అస‌లు ఉందా? లేదా? అన్న‌ది తేలాల్సి ఉంది. అస‌లు విమాన క్యాబిన్ లోకి ఎలుక ఎలా వెళ్లింద‌న్న‌ది అధికారుల బృందం విచార‌ణ స్టార్ట్ చేసింది. ఎలుక సంగ‌తేమో కానీ.. విమాన సిబ్బందికి.. ప్ర‌యాణికుల‌కు మాత్రం చుక్క‌లు క‌నిపించిన ప‌రిస్థితి.
Tags:    

Similar News