రతన్ టాటా - సైరస్ మిస్త్రీ వివాదంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మరింత అగ్గి రాజేశారు. మిస్త్రీకి టాటా అన్యాయం చేశారని ఆరోపించిన ఆయన... టాటా అందరూ అనుకున్నట్లు నీతిమంతుడేమీ కాదని.. అనేక కుంభకోణాల్లో ఆయన ప్రమేయం ఉందని ఆరోపించారు.
టాటా గ్రూపు చరిత్రలోనే రతన్ టాటా అంత అవినీతి పరుడు లేడంటూ స్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయపూర్ లో మీడియాతో మాట్లాడిన స్వామి.. రతన్ టాటా అసలు టాటా వంశీకుడు కాదని.. ఆయన తండ్రి టాటాలకు దత్త పుత్రుడని చెప్పారు. కేవలం తనను తాను రక్షించుకోవడానికే సైరస్ మిస్త్రీకి ఆయన అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. 2జీ - ఎయిర్ ఆసియా - విస్తారా భాగస్వామ్య ఒప్పందం - జాగ్వార్ డీల్ వంటి కుంభకోణాల్లో రతన్ టాటాకు పాత్ర ఉందని స్వామి ఆరోపించారు. ఈ స్కాముల్లో ఇరుక్కోకుండా తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే మిస్త్రీని తొలగించారన్నారు. కానీ చట్టం నుంచి రతన్ టాటా తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. అసూయ కారణంగానే రతన్ టాటా మిస్త్రీని టార్గెట్ చేశారని చెప్పారు. రెండు నెలల క్రితం సైరస్ మిస్త్రీని టాటాల బోర్డు ఎంతో మెచ్చుకుందని.. దీంతో అసూయతోనే రతన్ టాటా ఈ చర్యలకు దిగారని ఆరోపించారు. రతన్ టాటా కుంభకోణాలపై సిట్ తో విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాయబోతున్నట్లు తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/