ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బంపర్ ఆఫర్ ప్రకటించారు. హైదరాబాద్ లో ప్రారంభించిన టీహబ్ సెంటర్ కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఆయన భారీ ఆఫర్ ప్రకటించారు. అదిరిపోయే ఐడియాతో తమ వద్దకు రావాలే కానీ.. ఎంత మొత్తంలో అయినా పెట్టుబడి పెట్టటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి స్టార్ట్ అప్ లను ఆకర్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన టీ హబ్ దేశంలోనే మొదటిదని.. ఇలాంటిదే అమెరికాలో 1980లలో ప్రారంభించారని.. అలాంటిదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. స్టార్ట్ అప్ లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని రతన్ టాటా అభినందించారు. వినూత్న ఐడియాతో వచ్చిన ప్రాజెక్టుకు ఎంత పెట్టుబడి పెట్టేందుకైనా తాము సిద్ధమన్న మాట స్టార్ట్ అప్ లకు భారీ ప్రోత్సాహాన్ని ఇవ్వటం ఖాయం. అదే జరిగితే.. టీ హబ్ లక్ష్యం నెరవేరినట్లే.